Thursday, November 21, 2024

కల్తీ

                                                                                                                                పిల్లల పాలు కల్తీ

ఆకు కూరలు కల్తీ

కూరగాయలు కల్తీ

పప్పులు కల్తీ

పళ్ళు కల్తీ

మన ఆహారం మొత్తం కల్తీ

మన బతుకులే కల్తీ

కల్తీని బ్రతికిస్తున్నది మనమే

లంచాలతో అధికారులు

ఓట్ల కోసం నాయకులు

కల్తీని పెంచి పోషిస్తున్నారు.

డబ్బు తీసుకున్న కల్తీ ఓటర్లు

ఎవరినీ ప్రశ్నించలేరు.

పుబ్లిక్ గా కల్తీ చేస్తున్నవాణ్ని

ప్రశ్నించని ప్రజలు, నాయకులు

కల్తీకి రాజ పోషకులు

వారికి వారి బిడ్డలకు కాన్సర్లు వస్తే,

కిడ్నీలు ఫైలయితే

అది ఖర్మ అనుకుంటున్నారు

తామే దానికి కారణం అని

గుర్తించలేని మూర్ఖత్వంలో ఉన్నారు.

ఎప్పుడు మేలుకుంటాం?

అసలు మేలుకుంటామా?

Also read: అంతంలో అనంతం

Also read: 26/11

Also read: న్యాయం

Also read: రైలు దిగిన మనిషి

Also read: ఆత్మ నిశ్వాసం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles