రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
అంతా బాగుంటే ప్రేమికుల రోజు
కాకపోతే ప్రేమికుల దినం
చరిత్రలో రోజుల కంటే దినాలే ఎక్కువ
వీధి వీధినా ప్రేమలు వెల్లివిరిసినా
లైలా మజ్ను, దేవదాస్ పారూలు
కనిపిస్తారు అరుదుగా
ప్రేమే అలంబనగా
ప్రేమైక జీవనం గడిపే వాళ్లు
అభినందనీయులు, ఆరాధనీయులు.
అది శంకరుడు, బుద్ధుడు ఎమన్నా
జగతిని నడిపించేది ప్రేమే
రాగమే లేకుంటే అంతా విరాగమే
అందరికీ వీలుకానిది విరాగం
కొద్దిమందికే అది దేవరాగ మార్గం.
అదీ ఇదీ కాని సంధి స్థితిలో
గడిపేస్తారు జన బాహుళ్యం
ప్రేమికుల రోజే ప్రేమ గుర్తొస్తే
మదిలో కూడా ప్రేమ సమాధి అయినట్లే
క్షణ క్షణం అహరహం
తపింపజేసే తపస్సే ప్రేమ
అప్పుడు రోజూ ప్రేమికుల రోజే.
Also read: “రాగ రాగం”
Also read: “వివాహం”
Also read: గీత