1 హింది నా మాతృ భాష. నా సంఘ భాష తెలుగు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇంగ్లిష్ లెక్చరర్ని. నా పిల్లలిద్దరిని తెలుగు మాధ్యమంలో చదివించాను, కళాశాలకు వచ్చే వరకు. కేవలం భాషాభిమానం కాదు, తెలుగు ద్వారా విషయ గ్రహణం ఎక్కువని. వాళ్లిద్దరూ మంచి ఉద్యోగాల్లో వున్నారు.
2 ఉద్యోగం కోసం ఇంగ్లీష్ తప్పకుండా కావాలి. కాని ఇంగ్లిష్ కోసం ఇంగ్లిష్ మీడియం అవసరం లేదు.
3 నేటి ఆంగ్ల భాషా బోధనలో ఎవ్వరూ పట్టించుకోని పెద్ద లోపం పదాలు నేర్పించే ప్రయత్నం జరగక పోవడం. భాష నేర్చుకోవడానికి పదాలు నేర్వాలి. పాఠం లోని విషయాన్ని వివరించి ప్రశ్నలకు జవాబులు చదివిస్తే మార్కులు వస్తాయి కాని భాష రాదు.
4 విద్యార్ధుల సంగతి అటుంచి చాలామంది సహొద్యోగులే ఇంగ్లిష్ లో ఉత్తరాలు రాయలేరన్నది నిజం. వీళ్లు మొదటినుండి ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్ళు!
5 ఇదివరకు ఇంగ్లిష్, లెక్కలు ముఖ్యమైనవిగా భావించేవారు. ఇంజనీరింగ్, వైద్య చదువులకు ప్రాధాన్యం ఇచ్చే కార్పొరేట్ జూనియర్ కళాశాలలు వచ్చి ఇంగ్లిష్ చదువును పూర్తిగా చంపేశాయి. విద్యార్ధులు, తల్లిదండ్రులు కూడా వారికి సహకరించారు.
6 గవర్నమెంట్ స్కూళ్లలో అజమాయిషీ లోపం, ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ పని, తక్కువ జీతం చదువులో ప్రామాణికత లేకపోవడానికి కారణాలు.
7 ఉద్యోగాలు లేవు కాబట్టి చదువు మీద ఆసక్తి తగ్గిందంటారు విద్యార్ధులు. ఉపయోగపడగల సామర్ధ్యం వుంటే ఎంతమందికైనా ఉద్యోగాలిస్తాం అంటున్నారు పారిశ్రామికవేత్తలు.
8 ప్రభుత్వాలకు విద్య అముఖ్య విషయం. తనకు ఇంతకంటే మంచి శాఖ రాలేదని బాధపడని విద్యామంత్రి ఎవరైనా ఉన్నారా?
9 సంస్కృతం నేర్పించే పేరున తెలుగును చంపేస్తున్నారు. తెలుగు రాక, ఇంగ్లీషు రాక రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నారు విద్యార్థులు.
Also read: మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols).
Also read: “దృతరాష్టృడు”
Also read: మహా భారతంలో ధర్మం
Also read: బలరాముడు విష్ణు అవతారమా?
Also read: “ప్రేమ తగ్గితే”