Thursday, November 21, 2024

డే-నైట్ టెస్టు తొలిరోజునే వికెట్లు టపటపా

  • మోడీ స్టేడియంలో అక్షర్ స్పిన్ మ్యాజిక్
  • 112 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన పగలు-రాత్రి టెస్టు సమరం తొలిరోజుఆటలోనే ఇంగ్లండ్ కుప్పకూలింది.
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మూడోటెస్టును డే-నైట్ టెస్టుగా నిర్వహిస్తున్నారు.
సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్నా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

అక్షర్, అశ్విన్ స్పిన్ మ్యాజిక్…..

సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో రెండుజట్లు చెరోమ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో అహ్మదాబాద్ డే-నైట్ టెస్టు కీలకంగా మారింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టాస్ నెగ్గి…మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొన్నాడు.

భారత్ తుదిజట్టులోకి బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లను చేర్చుకొంటే…ఇంగ్లండ్ మాత్రం మూడుమార్పులతో బరిలో నిలిచింది. బెయిర్ స్టో, స్వింగ్ బౌలర్ యాండర్సన్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లను తీసుకొంది.

రెండో ఓవర్లోనే ఇశాంత్ బోణీ…

క్రాలే- సిబ్లేలతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను భారత లంబూ బౌలర్ ఇశాంత్ శర్మ తన రెండో ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. తన కెరియర్ లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇశాంత్ చక్కటి అవుట్ స్వింగర్ తో సిబ్లే ను డకౌట్ చేశాడు. రోహిత్ శర్మ పట్టిన క్యాచ్ కు సిబ్లే వెనుదిరిగిన సమయంలో ఇంగ్లండ్ స్కోరు కేవలం రెండు పరుగులు మాత్రమే.
వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన బెయిర్ స్టో సైతం తన ఖాతా తెరువకుండానే స్పిన్నర్ అక్షర్ పటేల్ కు చిక్కాడు. ప్రారంభఓవర్ల నుంచే వికెట్ స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండడంతో.. భారత కెప్టెన్ కొహ్లీ తన తురుపుముక్క అశ్విన్ ను బౌలింగ్ కు దించాడు.
అప్పటికే ఓపెనర్ క్రాలేతో కలసి కెప్టెన్ రూట్ మూడో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.2 బౌండ్రీలతో 17 పరుగులు సాధించిన రూట్ ను అశ్విన్..
ఎల్బీడబ్ల్యుగా పడగొట్టాడు.

అక్షర్ విశ్వరూపం……

హోంగ్రౌండ్ మోతేరా స్టేడియంలో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. వికెట్ వెంట వికెట్ తీస్తూ ఇంగ్లండ్ ను కోలుకోనివ్వకుండా చేశాడు. 10 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ సాధించిన క్రాలే, డాషింగ్ ఆల్ రౌండర్ స్టోక్స్ లను అక్షర్ అవుట్ చేశాడు.
మిడిలార్డర్ ఆటగాళ్లు పోపీ, జాక్ లీచ్ ల వికెట్లు అశ్విన్ పడగొడితే…లోయర్ ఆర్డర్ ను అక్షర్ పెవీలియన్ దారి పట్టించడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కేవలం 48.4 ఓవర్లలో 112 పరుగులకే ముగిసింది.

అక్షర్ పటేల్ 38 పరుగులిచ్చి 6 వికెట్లు, అశ్విన్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. తన కెరియర్ లో కేవలం రెండోటెస్టు మాత్రమే ఆడుతున్న అక్షర్ పటేల్ చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల తర్వాత…అహ్మదాబాద్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు సాధించడం విశేషం.

సమాధానంగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్-గిల్ జోడీ ఆచితూచి ఆడుతూ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. తొలిఇన్నింగ్స్ లో భారత్ భారీస్కోరు
సాధించడం ద్వారా మూడున్నర రోజుల్లోనే టెస్టును ముగించడం ద్వారా టెస్ట్ లీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles