- ముఠాను పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు
- విచారణ జరుపుతున్న పోలీసులు
రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్సు సిఐ కిరణ్ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సిహెచ్ కిరణ్ వారి సిబ్బంది మంచిర్యాల జిల్లా కేంద్రంలో చింతపండు వాడ ఏరియాలోనీ కారు వాషింగ్ సెంటర్ లో నాసిరకం ఇంజన్ ఆయిల్ తయారు చేసి అమ్ముతున్నారనే పక్కా సమాచారం మేరకు తనిఖీ చేపట్టారు.
MD.ముజాయిద్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్ నుండి నాణ్యతా ప్రమాణాలు లేని లూజ్ ఇంజన్ ఆయిల్ ను మంచిర్యాలలోని తన కారు వాషింగ్ సెంటర్ కు తరలించేవాడు. దానిలో ఆరంజ్ రంగు ద్రావకాన్ని కలిపి వాడేసిన ఇంజన్ ఆయిల్ బాటిళ్లను సేకరించి వాటిలో నకిలీ ఇంజన్ ఆయిల్ ను నింపేవాడు. బాటిల్ పైన లేబుల్ ను ఇస్త్రీ పెట్టితో సహయంతో అతికించి ఇటిక్యాలలోని ఆటోస్టోర్ షాప్ కు తరలించాడు. మరో నిందితుడు రవి ఆ నాసిరకం కల్తీ ఇంజన్ ఆయిల్ ను ప్రముఖ కంపెనీ ఇంజన్ ఆయిల్ అని చెప్పి వాహనదారులను మోసపుచ్చేవాడని టాస్క్ ఫోర్స్ సీఐ తెలిపారు.
మహ్మద్ ముజాయిద్ కారు వాషింగ్ సెంటర్ తనిఖీ చేయగా నాసిరకం ఇంజన్ ఆయిల్ తయారీకి వాడుతున్న ఆరంజ్ రంగు ద్రావకంతో పాటు దాదాపు 117 లీటర్ల నాసిరకం ఇంజన్ ఆయిల్, 80 ఖాళీ బాటిళ్లను స్టిక్కర్ అంటించేందుకు వాడిన ఇస్త్రీ పెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను, ఇంజన్ ఆయిల్ ను మరియు ఇతర సామాగ్రిని తదుపరి విచారణ నిమిత్తం కొరకు మంచిర్యాల పోలీసులకు అప్పగించారు.