ప్రముఖ తెలుగు భాషావేత్త, కథకుడూ, పరిశోధకుడూ, తెలుగు అకాడెమీ పూర్వ ఉపసంచాలకులూ డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి (85) ఇక్కడి చైతన్యపురిలోని స్వగృహంలో శనివారం సాయంత్రం గం. 7. 20 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన పిహెచ్ డీలో పరిశోధన అంశం తెలుగు కథానిక. దక్షిణామూర్తి తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు. నిష్కలంకమైన యోగిలాగా చివరి వరకూ జీవించిన దక్షిణామూర్తి కొన్నేళ్ళుగా అస్వస్థులుగా ఉన్నారు. యోగానంద పరమహంస రచించిన ‘యన్ ఆలోబ్రయోగ్రఫీ ఆఫ్ ఏ సెయింట్’ అనే పుస్తకాన్ని ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో తెలుగులోకి అనువదించారు. 29 డిసెంబర్ 1935న తూర్పుగోదావరి జిల్లా ఆరు గ్రామంలో జన్మించారు.
Also Read : కథాభి`రాముడు`
డాక్టర్ పోరంకి అనేక నవలలూ, కథలూ, పరిశోధనా వ్యాసాలు రాశారు. ‘వెలుగు,’ ‘రంగవల్లి’ అనే నవలలను కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాలలో రచించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోరంకి దక్షిణామూర్తి శనివారం సాయంత్రం తనువు చాలించారని ఆయన తనయుడు పోరంకి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.