వోలేటి దివాకర్
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ చర్చలకు దారితీస్తోంది. త్వరలో తమిళనాడులో మహారాష్ట్ర తరహా పాలన మార్పు జరుగుతుందని ఆయన జోస్యం చెపుతున్నారు. రాష్ట్రంలో “ఏక్నాథ్ షిండే ఉద్భవిస్తారని” పేర్కొన్నారు,
ఇదే సారూప్యత
మహారాష్ట్రలో దివంగత శివసేన అధినేత బాల్ థాకరే పెద్ద కుమారుడు, బిందుమాధవ్ సినిమాల్లోకి ప్రవేశించడం టిఎన్‌ఎన్ మాజీ సిఎం ఎం కరుణానిధి మొదటి కుమారుడు ము కా ముత్తు “ఇద్దరూ సినిమాల్లో నటించాలని అనుకున్నారు కానీ సినిమాలు బాగా ఆడలేదు” అని అన్నామలై పేర్కొన్నారు.
అలాగే ఠాక్రే రెండో కుమారుడు జయదేవ్ కుటుంబానికి దూరంగా ఉన్నారని, కరుణానిధి రెండో కుమారుడు ఎంకే అళగిరి కూడా కుటుంబానికి దూరంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Also read: రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎంపి అడ్డానా?!
ఆయన మూడో కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశం వచ్చిందని, అలాగే ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. “ఇద్దరూ తమ తమ పార్టీల యువజన విభాగం నాయకులు.
రెండున్నరేళ్ల క్రితం డీఎంకే ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నట్లే మహారాష్ట్రలో మూడు పార్టీలు చేతులు కలిపాయి.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చేతులు కలిపాయి. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీని వెనక్కి నెట్టి, 56 మంది ఎమ్మెల్యేలతో సేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అనూహ్యంగా ఏకనాథ్ షిండే పార్టీని చీల్చి ఉద్దవ్ ను దించేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇందుకు బీజేపీ సహకరించింది.
Also read: గోరంట్ల మాట్లాడేది ఎవరి గురించి?!
తమిళనాడులో సాధ్యమేనా?
తమిళనాడులో కూడా ఇది జరుగుతుందని అని అన్నామలై చెప్పారు. అయితే ఏక్ నాధ్ ఎవరో చెప్పలేదు. అన్నామలై వ్యాఖ్యలను అధికార డీఎంకే నాయకులు కొట్టి పారేశారు. తమిళనాడులో రాజకీయ వారసుల మధ్య కొన్ని పోలికలు ఉన్నా రాజకీయ సమీకరణాలు వేరుగా ఉన్నాయి. బీజేపీ నేత వ్యాఖ్యలతో అక్కడ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత ఆసుపత్రిలో ఉండగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలో తిష్ట వేసి అన్నా డీఎంకే ను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.
Also read: పదవులు వద్దన్న ఉండవల్లి!
ఏపీ లో ఏక్నాథ్ ఉన్నాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు చెప్పినట్లుంది… కనీసం విశ్లేషణ లేకుండా తప్పుదారి సరికాదు..సినిమా వేరు.. రాజకీయం వేరుకదా.. సీనియర్ జర్నలిస్టుకు ఇది తెలియకపోవడం శోచనీయం. ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు.. మరి చిరంజీవి?