- పోలీసులను అభనందిచిన ఏసీపీ
- వంద మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు
గోదావరి ఖని సమీపంలోని గోదావరి వంతెన నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీసు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు 24 గంటలు షిప్టుల వారీగా విధులు నిర్వహించేందుకు గోదావరి ఖని టుటౌన్ పోలీసులు ఇక్కడ సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత, ఇతర కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడేవారిని అడ్డుకోవడం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపుతున్నారు.
గోదావరి నదిలో నీటి ఉధృతి ఎక్కువ గా ఉండడంతో నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతుంది. దీంతో బాధితులను గుర్తించి చాకచక్యంగా పోలీసులు కాపాడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు మరియు ఆత్మహత్యలకు పాల్పడే వారిని కాపాడడానికి గోదావరి రివర్ పోలీస్ టీం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. పరిసరాలను గమనిస్తూ అక్కడకు వచ్చే వారిపై నిరంతరం నిఘా ఉంచుతోంది. ప్రజా రక్షణ ద్యేయంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గోదావరి రివర్ పోలీసింగ్ విధులు నిర్వహిస్తోంది.
సుందిళ్ళ బ్యారేజి బ్యాక్ వాటర్ స్టోరేజ్ అయినప్పటి నుండి నలుగురు రివర్ పోలీసులను నియమించి ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో, కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు ప్రయత్నించిన 100 మందిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాపాడిన వారిలో 63 మంది మహిళలు 37 మంది పురుషులని తెలిపారు. మరో 14 మంది మృతి చెందినట్లు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2019 లో న రివర్ పోలీస్ ని ప్రారంభించడం జరిగింది. రివర్ పోలీస్ విధుల్లో అప్రమత్తంగా ఉండి పలువురి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ మల్లయ్య, J. శ్రీనివాస్, K.వెంకటస్వామి, రమేష్ లను మరియు రెస్క్యు టీం సభ్యులను* ,గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ గారు,గోదావరిఖని టూ టౌన్ సిఐ కూచన శ్రీనివాసరావు గారు నగదు బహుమతి బహూకరించారు.