- ప్రమాణాలు తుంగలో తొక్కుతున్న పిల్లలు
ఈనాటి వివాహ వ్యవస్థ మూడు ఆడియోలు… ఆరు వీడియోలు గా సాగుతోంది. పెళ్లి కాక ముందే వరుడు వధువు ఫ్రీ హనీమూన్ ట్రిప్ వేసి అన్ని యాంగిల్స్ లో షూట్ లు చేసి పార్కులు, పల్లె పొలాల్లో వివిధ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫోటో షూట్ లతో పెళ్లి రోజు పుస్తె కట్టే ముందు కంటే వేదికలో ఒక వైపు తెర మీద వీళ్ళ అసభ్య ప్రవర్తన రీలు లో కదులుతుంటే పెళ్లి కి వచ్చిన యువతరం కేరింతలు కొడుతున్నారు. పెద్దలు ఆ సీన్స్ చూడలేక విందు ఆరగించకుండానే వెనుదిరిగి పోతున్నారు. ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన కామాన్ని ధర్మ బద్ధం చేయటానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం.
కర్తవ్య నిర్వహణ మార్గం
వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణము, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది. వరుడు వధువు పెళ్లి చూపుల తరువాత ప్రమాణం చేసి వధువు మెళ్ళో తాళికట్టాలి. అంతకు ముందు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీ, సరస్వతి, పార్వతి ల ఏకాత్మక రూపంగా వధువును తలుస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్య పరచే ప్రకృతి యొక్క ప్రతిరూపంగా వధువు కాళ్ళకు పారాణి పూసి జడలో మల్లెలు తురిమి మొహానికి పసుపును రాసి అలంకరిస్తారు.
Also Read : ఎర్ర కోటపై రైతు జెండా, కన్నెర్ర జేసిన కేంద్రం
త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషునిగా వరుడిని తలుస్తారు. కానీ మోడ్రన్ పెళ్లిళ్లు అన్నీ మమ అనిపించే విధంగా జరుగుతున్నాయి.
అంతా ఎంటర్ టైన్ మెంటే
పెళ్లి చూపులు, నిశ్చయతాంబూలాలు, విఘ్నేశ్వరుడికి బియ్యం, బెల్లం, పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకును చేయడం, గౌరీపూజ, పేరంటాలు పెట్టడం, కాళ్లు కడగడం, జీలకర్ర – బెల్లం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, ఉంగరాల ఆట, అరుంధతీ నక్షత్రం అన్నీ పెళ్లి తంతులో ఘనంగా నిర్వహిస్తున్నా కూడా అది పిల్లల చేష్టలుగా ఎంటర్ టైన్ మెంట్ గా చేస్తున్నారు తప్ప చిత్త శుద్ది లేదు. ఒక వైపు సంగీత కచేరి మరో వైపు ఆ పాటలకు అసభ్య నృత్యం చేసే ఐటమ్ గర్ల్స్, మరో వైపు వేదిక క్రింద వాళ్ళను ఉత్సాహ పరిచేలా చుట్టాల చప్పట్లు ఈ గోలలో మైక్ లో మేము చెప్పే పెళ్లి నాటి ప్రమాణాలు కొత్త జంటకు చెవికి ఎక్కడం లేదని వశిష్టులు వాపోతున్నారు. మేము చేసే హితవచనాలు పెళ్లి బాజాల్లో కలుసిపోతున్నాయని వారు అంటున్నారు. దీనికి కారణం ప్రేమలు దోమలు. ఇప్పుడు అన్ని రెడీ మెడ్ పెళ్లిల్లు. షాపింగులు, ఈటింగులు, షూటింగులు. దాని వల్ల సంప్రదాయ పెళ్లిళ్లు కరువయ్యాయి.
Also Read : సోషల్ మీడియా సామాజిక విప్లవమా?సమస్యల సమాహారమా?
వివిధ రకాల వివాహాలు
వరుడు వధువుకు ఆమె సంబంధీకులకు శక్తి కొలదీ ధనమిచ్చి వివాహం చేసుకుంటున్న వివాహాలు కొన్ని. వీటిని అసుర వివాహం అంటారు. ఇక గాంధర్వ వివాహం స్త్రీ పురుషులిద్దరూ ఇష్టపడి ఒకర్ని మరొకరు అనుసరించాలనే దృక్పథంతో చేసుకునే పెళ్లి. ఇది ప్రేమ మూలకంగా జరిగే పెళ్లి. ఇందులో పెద్దల ప్రమేయమే ఉండదు. ఇక పైశాచిక వివాహం ఇది ఓ రకమైన బలాత్కార వివాహం. హాయిగా నిద్రపోయే ఆడపిల్లని, మగవాడిని అపహరించుకుపోయి చేసుకునే పెళ్లి. ఈ బలాత్కార పెళ్లిళ్లలో కూడా అమ్మాయిలు ముందు ఉన్నారు. మరో రకం పెళ్ళి రాక్షస వివాహం. అమ్మాయి బంధువుల్ని, సంబంధీకుల్ని హింసలు పెట్టి అయినా సరే అమ్మాయిని దొంగిలించుకుపోవడం రాక్షసం. ఈ మధ్య కాలం లో ఇవే ఎక్కువగా జరుగుతున్నాయి!
Also Read : స్వర్గం ఒక భ్రాంతి.. ఐశ్వర్యం – పేదరికం – పురుషాధిక్యత!