- జనవరి 10 వ తేదీ ఉదయం 9.30 గంటలకు జూమ్ లో ప్రారంభం
- సదస్సు నిర్వహిస్తున్న వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం, చికాగో సాహితీ మిత్రులు
వృత్తిరీత్యా వైద్యులైన ఎం. వి రమణారెడ్డి రాయలసీమ ప్రాంతంలో పలు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం పోరాటం చేశారు. ఎంవీ రమణా రెడ్డి 1983లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గళమెత్తారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, నీళ్లు, పరిశ్రమల కోసం రాయలసీమ విమోచన సమితిని స్థాపించి ఉద్యమాలు చేశారు
పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన డా.ఎంవీఆర్:
డాక్టర్ ఎంవీ రమణా రెడ్డికి సామాజిక, సాహిత్య అంశాల వ్యాసకర్తగా, కరపత్ర రచయితగా, కథారచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా, పత్రికల నిర్వాహకులుగా విశిష్టమైన స్థానం ఉంది. 8 సొంత పుస్తకాలు, 5 అనువాద పుస్తకాలు, ఇంకా సాహిత్య విలువలున్న ఇతరుల పుస్తకాలను ప్రచురించారు. “ప్రభంజనం” పత్రికను నడిపారు. ఏడు పదుల వయసులోనూ సాహిత్య రంగంలో అహర్నిశలు కృషి చేస్తూ వస్తున్నారు.
జూమ్ సదస్సులో పాల్గొననున్న అతిథులు, వక్తలు:
డాక్టర్ ఎం.వి రమణారడ్డి చేసిన సాహిత్య కృషిని నేటి తరాలకు తెలియ చేసేందుకు వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం, చికాగో సాహితీ మిత్రులు సంకల్పించారు. జనవరి 10 ఆదివారం ఉదయం 9.30 గంటలకు జూమ్ ద్వారా జరిగే సదస్సులో అతిథులుగా ప్రముఖ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిలు పాల్గొంటారు. వక్తలుగా నాగసూరి వేణుగోపాల్, బాణాల భుజంగరెడ్డి, ఆర్.యం. ఉమామహేశ్వరరావు, దేశం శ్రీనివాసరెడ్డి, వై కామేశ్వరి, అంబటి సురేంద్ర రాజు, యస్. విజయక్రిష్ణ, జూపల్లె ప్రేమ్ చంద్, మువ్వా శ్రీనివాసరెడ్డి, పసునూరి రవీందర్, బి. హరిత, ఎ.వివికె చైతన్య, జి. మల్లిఖార్జునతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని తిమ్మాపురం ప్రకాశ్ సమన్వయ పరుస్తారు.
డాక్టర్ ఎం. వి రమణారెడ్డి సాహిత్యంపై జనవరి 10 వ తేదీ ఉదయం 9.30 గంటలకు అంతర్జాలం ద్వారా జూమ్ సదస్సు లో అతిధులు, వక్తలు పాల్గొని ప్రసంగిస్తారు.
Zoom link:
ఈ క్రింది జూమ్ లింక్ ద్వారా నేరుగా సమావేశంలోకి రావచ్చు
ఈ కార్యక్రమం YouTube లో live ప్రసారమవుతుంది. దిగువన ఉన్న లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.
YouTube link https://youtu.be/0QX1JulUfhI