- లోపించిన పారదర్శకత
- యాజమాన్యం అలసత్వం
- కార్మికుల వివరాలు గోప్యం
హిందీస్ ల్యాబ్ లో 24-08-2022 న జరిగిన కెమికల్ ప్రేలుడు పై పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం (PUCL -TS) నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్:
తేదీ 27-08-2022 న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు లోని హిందీస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన భారీ కెమికల్ పేలుడు గురించీ. కార్మికుల స్థితి గతులపైనా అధ్యయనం చేసేటందుకు తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల ప్రజా సంఘం పర్యటించింది. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇక్బాల్ ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సలీం, కార్యవర్గ సభ్యుడు ఉమర్ లు ఉన్నారు.
Also read: పంద్ర + ఆగస్టు = పంద్రాగస్టు
హిందీస్ ల్యాబ్ ప్రైవేట్ కంపెనీ 2006 నుండి వెలిమినేడు ప్రాంతంలో పనిచేస్తోంది. ఇందులో “బల్క్ డ్రగ్, డ్రగ్ ఇంటర్మీడియట్ (పెద్ద మొత్తంలో ఔషధాల/ మందులు తయారీ మరియు ఔషధ ఇంటర్మీడియట్) తయారీ అందులో జరుగుతున్నది దీని సామర్థ్యం నాలుగు విషయాలపై ఆధారపడి ఉన్నది. అవి, రసాయన సంశ్లేషణ నాలుగు ప్రక్రియ దశలలో జరుగును – ప్రతిచర్య, వేరు చేయడం, శుద్ధి చేయడం మరియు ఎండబెట్టడం (Chemical Synthesis Consists of Four Process Steps – Reaction, Separation, Purification, and Drying). దీనికి డైరెక్టర్స్ గా జొన్నల సాంబి రెడ్డి, కసిరెడ్డి సుభాష్ చందర్ రెడ్డిగా ఉన్నారు.
హిందీస్ ల్యాబ్ ప్రైవేట్ కంపెనీ లో సుమారుగా 1500 నుండి 2000 వరకు కార్మికులు పనిచేస్తున్నారని వెలిమినేడు గ్రామ ప్రజలు చెపుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న HR విభాగానికి చెందిన సంబంధీకులు 300 కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారని కమిటీకి చెప్పారు. అందులో పనిచేస్తున్న కార్మికులు చెప్పేది 1000 లోపు కార్మికులు పనిచేస్తున్నట్లు చెపుతున్నారు. ఇందులో పనిచేస్తున్న కార్మికులందరూ దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులే. కెమికల్ పేలుడు ప్రమాదానికి గురైన వారిలో మధ్యప్రదేశ్ కు చెందిన శుభం అనే కార్మికుడు, జార్ఖండ్ కు చెందిన బలదేవ్ అనే కార్మికుడు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కార్మికుడు రాజ్ కుమార్ లు ఉన్నారు. ఈ ఫార్మా కెమికల్ పరిశ్రమలో పనిచేసే వారు మొత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారే – UP, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రా ల నుండి వచ్చి రూ. 10,000 నుండి రూ. 17,600 వరకు జీతాలను తీసుకుంటున్నారు. మరికొందరు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వారికి రోజు 400/ రూపాయలు చొప్పున యాజమాన్యం చెల్లిస్తున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది.
Also read: జుబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి: హక్కుల నేతలు
హిందీస్ ల్యాబ్ ప్రైవేట్ కంపెనీ తనదగ్గర ఎంతమంది పనిచేస్తున్నారో చాలా స్పష్టంగా బోర్డు పై ప్రదర్శించాలి. ఇది జరగలేదు. స్కిల్డ్ కార్మికులు ఎందరు, అన్ -స్కిల్ల్డ్ కార్మికులు ఎందరు, ఏ ఏ షిఫ్ట్ లలో ఎంతమంది పనిచేస్తున్నారో అనేది కూడా చెప్పాలి. ఇదీ చెయ్యట్లేదు. అక్కడ కార్మికుల పరిస్థితి ఒక బందెర దొడ్డిలోకి పశువులను కొట్టించే విధానం కనిపిస్తున్నది. షెడ్లల్లో పడుకోవటం, బహిరంగంగా మూత్ర విసర్జనలు, స్నానాలు వారి బ్రతుకులు.
ఫార్మా కెమికల్ ప్రాసెసింగ్ లో జరిగిన ఒక తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనేటందులకు అన్నివిధాలుగా సర్వ శక్తులను కంపెనీ యజమానులు, యజమానికింద పనిచేసే ఉన్నతోద్యోగులు ఉపయోగించుకొన్నారు ఆని చాలా స్పష్టంగా కమిటీకి కనిపించింది. వారి ధీమాకు పరాకాష్ట పోలీసుల ప్రవర్తన. నాలుగు గోడల మధ్య జరిగిన పేలుడుకు చెందిన విషయాన్ని ట్రాన్సపరెంట్ గా ఉంచాలి. పోలీసులు దాచిపెట్టటం, కంపెనీ యజమానులు దాచిపెట్టటం దేనికి సూచన? పేలుడు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అయినట్లు, నలుగురు ఆసుపత్రిలో నుండి బయట కు వచ్చినట్లు, ఇద్దరు రేపో మాపో వస్తున్నట్లు, ఒక్కరు క్రిటికల్ గా ఉన్నట్లు పోలీసులు, ఫార్మా కంపెనీ యజమాని/ఆ తరువాతి కంపెనీ ఉద్యోగస్తులు పొల్లుపోకుండా మంచిగా ట్రైన్డ్ వ్యక్తులుగా చెపుతున్నారు. వీరి ప్రవర్తన లేని అనుమానం కలిగిస్తోంది. పారదర్శకమైన పద్దతులను పాటించక పోవటం, 12 అంబులెన్స్ లు వచ్చాయని ప్రచారం జరగటం, పేలుడు ప్రమాదానికి ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు గురి కావటం — పోలీసుల ప్రవర్తన, ఫార్మా కంపెనీ యజమానుల ప్రవర్తన పరిశీలకులకు నిజంగానే 10-12 మంది కార్మికులు చనిపోయి ఉన్నారేమో ననే ఒక బలమైన నమ్మకం కలిగిస్తుంది. నేటికీ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలలో ఉన్న భయంను, ఆందోళనను, అనుమానాలను ఎవ్వరూ పోగొట్టలేక పోతున్నారు. ఆ ప్రాంతం నుండి కంపెనీని తరలించాలని ప్రజలలో బలంగా కోరిక రోజు రోజుకు పెరుగుతున్నది. ఇది ఎటు వైపైనా దారితీయవచ్చును.
Also read: తెలంగాణ రాష్ట్రం – రాజకీయ సంక్షోభం?
మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలు ..
* వెంటనే కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల లిస్టును బహిర్గతం చేయాలి
* 24-08-2022 న పనిచేసిన కార్మికులకు చెందిన ID లను బహిర్గతం చేయాలి,
* పేలుడుకు గురైన బ్లాక్ ను చూసేటందుకు వచ్చే పరిశీలకులకు అనుమతి ఇవ్వాలి,
*కార్మికులు నిర్భయంగా పరిశీలకులతో మాట్లాడేటందుకు వాతావరణం కలిగించాలి.
* 24-08-2022 న ఏం జరిగిందో పారదర్శకమైన ఒక రిపోర్ట్ ను Directorate General of Health Services, Ministry of Health & Family Welfare, Government of Indiaకీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, లేబర్ – ఎంప్లొఎమెంట్ ట్రైనింగ్, ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ అఫ్ తెలంగాణకీ సంయుక్తంగా విడుదల చేయాలి.
* 24-08-2022 నాడు పేలుడుకు బలైన కార్మికుల ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం హిందీస్ ల్యాబ్ ప్రైవేట్ కంపెనీ పారదర్శకంగా కట్టివ్వాలి. దీనిని ప్రభుత్వం పర్యవేక్షించాలి.
* పేలుడుకు బాధ్యులైన జొన్నల సాంబి రెడ్డి, కసిరెడ్డి సుభాష్ చందర్ రెడ్డి లపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించాలి.
* ప్రమాదాలను ముందస్తుగానే అరికట్టే పద్ధతులను తూచా తప్పక వాడాలి,
* పరిశ్రమలను పర్యవేక్షించే ప్రభత్వ అధికారుల అలసత్వం పై విచారణ చేసి, వారిపైన చట్టపరమైన చర్యలను ప్రభుత్వం ప్రారంభించాలి.
* కంపెనీ చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలలో ఉన్న భయాన్ని, ఆందోళనను, అనుమానాలను యుద్ధ ప్రాతిపదికన నివృత్తి చేయడం కోసం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి.
Also read: 124-ఏ ఐపీసీ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం
–జయ వింధ్యాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
పౌర హక్కుల ప్రజా సంఘం (PUCL -PS)
9440430263 /9494869731