వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,
ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్
మాడభూషి శ్రీధర్ తెలుగు భావ గీతిక
వినుడు సౌభాగ్యసుదతులార, ఇది ఇడుముల బెట్టువ్రతముకాదు
పరమానందబ్రహ్మము చేర్చునోము నియమాలు తెలియరండి
పాలకడలి నాథుడి పాలు మనము, వేరు పాలు మనకేలమగువలార
కృష్ణయ్య నెయ్యము సాధింప నెయ్యి మానుదము పూబోడులార
తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు
చేయరాని పనులు వద్దన్న చేయకుండుటె మేలు, చాడీలు,
మనసు నొప్పించు విరుపులొద్దు, హితవులు వినడమే మనకు మంచి
దానధర్మాలతో నడచి దామోదరుని చేరుటే మన తిరునోము దారి.
పాలకడలి శయనుడు
పాలకడలిలో శేషశయ్యపై శయనించే శ్రీవైకుంఠనాథుడి పాదాలనే వేడు కుంటున్నారా గోపికలు. యమునాస్నానాలతో తెల్లారి శుచులైనారు. అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. చాడీలు, పుల్లవిరుపు మాటలు లేవు, శ్రీకృష్ణ దామోదరుడిని చేరడానికి పరితపిస్తున్నారు.
పాలూ నేయి వద్దని, అలంకారాలు కాదని, స్నేహంతో ఉంటామని ప్రతిన చేసి, కలిసి వచ్చిన గోపకులకు శ్రీపాదాలేశరణమన్నదృశ్యమిది. శ్రీహరి ముఖంలో చిరునవ్వును నాటిన బాపు, మూసిన కన్నుల వెనుక కాంతిని మనసంతా నింపేసాడు. ఆ మహా కళాకారుడు గీసినగీతలు యమునాతరంగాలను తలపింపజేస్తున్నాయి. ఇతర జీవకోటిలేనపుడు తాను మాత్రమే ఉన్న విష్ణుని చేర్చేది నమస్కారాలే.
Also read: శూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై
(బాపు రేఖ, శ్రీధర్ వ్యాఖ్య)