తెలుగుకు ఇటీవల బాగా జబ్బు చేసింది. నిజానికి పాత రోగమే. నిర్లక్ష్యం జబ్బు. ఇప్పుడు బాగా ముదిరింది. పసితనంనుండి తెలుగు మాస్టారంటే అలుసు. అయ్యవారిపై గౌరవం లేనపుడు ఆ విద్య రాదుగా. అన్ని పుస్తకాలు తెలుగులో చదివినప్పుడే అది సరిగ్గా రాలేదు. ఇప్పడు అంతా ఇంగ్లీషు మయం. దొరల్లా ఇంగ్లీషు మాట్లాడాలని అదే జీవిత ధ్యేయమన్నట్లు అన్ని పుస్తకాలు ఇంగ్లిషులోనే చదివే ప్రయత్నం. తెలుగును బలి ఇచ్చినా ఇంగ్లీషు వరం నూటికి ఎనభై ఐదు గురికి దక్కక పోవడం వాస్తవం.
Also read: “చలం – స్త్రీ”
గిడుగు, గురజాడ పుణ్యమా అని గ్రాంధికం వదిలి వ్యవహారిక తెలుగు వచ్చింది. పత్రికలు, సినిమాలు చదువుకున్న జనం భాషను అందరికి అలవాటు చేశాయి. ప్రాంతీయ యాసలను వదలి అందరు ఒక తెలుగుకు అలవాటు పడ్డారు.
Also read: “రచన లక్ష్యం”
ప్రాంతీయ తత్వంతో తెలంగాణా రాష్ట్రం ఏర్పఢ్ఢ తర్వాత వారి ప్రాంతీయ భాషపై మక్కువతో విద్యార్థుల పుస్తకాలు, పత్రికలు, టివి ఛానళ్లు, అక్కడి సినిమాలు అన్నీ అక్కడి తెలుగును మార్చేశాయి. దాని ప్రభావం ఆంధ్ర ప్రాంతంలోనూ కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో ఆంధ్ర ప్రాంత తెలుగు తుడిచిపెట్టుకు పోయే ప్రమాదముంది. కొంతమేర ఉత్తరాంధ్ర, గోదావరి, కడప ప్రాంత తెలుగు యాసలు వినిపిస్తున్నా త్వరలోనే అన్ని పత్రికలు, సినిమాలు క్రమంగా తెలంగాణా భాషలోకి మారడం చూస్తాం, మన తెలుగును మనం నిలుపుకోకపోతే.
Also read: “మహమ్మారి”
ఎన్నో త్యాగాలతో సంపాదించిన రాష్ట్రాన్ని విడిపోకుండా చూడలేకపొయ్యాం. బలిదానాలతో తెచ్చుకున్న విశాఖ ఉక్కును వదులుకుంటున్నాం. మన భాషపై ప్రస్తుతం జరుగుతున్న దాడిని చూస్తూ ఊరుకుందామా? మన పొరుగువారందరికి ఉన్న స్వభాషాభిమానం మనకు లేదా?
Also read: “గుడిపాటి వెంకట చలం – అధివాస్తవికత”