- మోదీ-చంద్రబాబు ఒప్పందం గొప్పదా, చట్టం గొప్పదా?
- మోసం చేస్తే ప్రజలు సహించరు
- ‘కేవీపీలాగా కోర్టులో కేసు వేయండి’
- ఇంతవరకూ అయిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా?
రాజమహేంద్రవరం: పోలవరం పై కేంద్ర ప్రభుత్వం కొత్త మెలిక పెట్టిందనీ, పోలవరం ప్రాజెక్ట్ కు ఈ దుస్థితి వస్తుంది అనుకోలేదనీ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారంనాడు ఇక్కడ విలేఖరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ, జరుగుతున్న ప్రతి తప్పును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్పారు.
‘రిజర్వాయర్ నిర్మించేందుకు పోలవరం అనువైన ప్రాంతం, రిజర్వాయర్ కట్టడం అంటేనే భూ సేకరణ…భూ సేకరణ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరగదు పార్లమెంట్ లో చేసిన చట్టం గొప్పదా? మోడీ,చంద్ర బాబు చేసుకున్న ఒప్పందం గొప్పదా? పోలవరం ప్రాజెక్ట్ కట్టి మీకు ఇస్తాం… ఖర్చులు, పర్మిషన్లు అన్ని మేమే చూస్తాం…అని ఆక్ట్ లో పెట్టారు..పోలవరం పై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైసీపీకి లేదు,’ అంటూ అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
‘పోలవరం కేంద్రం కట్టి ఇవ్వాల్సిందే అని జగన్ పాదయాత్రలో అదే చెప్పారు. వైఎస్ఆర్ అనే పెరుపెట్టుకుని అధికారం లోకి వచ్చారు, పోలవరం కోసం ఎందుకు ముందుకు వెళ్లడం లేదు? నీ కేసుల కోసం ప్రజల్ని మోసం చేస్తే.. క్షమించరు. 2017 లో కేవీపీ రామచంద్రరావు వేసినట్టు మీరు కేసు వెయ్యండి,’ అని కూడా ఉండవల్లి అన్నారు.
‘జగన్ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పారు. పోలవరం ఆక్ట్ ఇంప్లిమెంట్ కూడా చేయించలేక పోతే ఇంకా ఎందుకు ప్రభుత్వం? ప్రాజెక్టు రాకపోతే ఇప్పటివరకు ఖర్చు పెట్టిన 10 వేల కోట్లు ఏమైనట్లు? బూడిదలో పోసినట్లు కాదా? జగన్ మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కట్టాలి. కేంద్రం తరపున..పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం వర్క్ చేస్తుంది… పోలవరం గురించి గతంలో చంద్రబాబు మాట్లాడారు, ఇపుడు జగన్ మాట్లాడరు…ఒకరిపై ఒకరు కేసులకోసం బయపడ్తున్నారు,’ అంటూ అరుణ్ కుమార్ విమర్శించారు.
జగన్ మోహన్ రెడ్డికి శిక్ష పడితే వెంటనే జైల్ కి వెళ్ళడు, సుప్రీం కోర్ట్ బెయిల్ ఇస్తుంది.ఆయన ప్లేస్ లో అతని మనిషే కొనసాగుతాడు. అయిదు ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న హయాం లో నేను ఎంపీ గా ఉన్నపుడు 400 కోట్లు ఇచ్చారు. పోలవరం విషయంలో కాంప్రమైజ్ అయిపోతే ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు? రాజశేఖర్ రెడ్డి కొడుగ్గా జగన్ ఎందుకు?’’ అని అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
Good news