యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారికి కిలో ఒక తుల బంగారం!
సమర్పించనున్నట్లు ప్రకటించిన చేవెళ్ళ ఎంపీ
అలాగే… పార్లమెంట్ నియోజకవర్గం నుంచీ విరివిగా విరాళాలు
సిఎం కెసిఆర్ గారు అత్యద్భుతంగా… ఇల లో…అల వైకుంఠ పురంగా ఆవిష్కరిస్తూ, అత్యద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతూన్న, యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారి విమాన గోపురం స్వర్ణ తాపడానికి నేను సైతం అన్నారు చేవెళ్ళ లోక్ సభ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి. ఆలయానికి త్వరలో చేయనున్న విమాన గోపురం బంగారు తాపడానికి కీలో ఒక తులం బంగారాన్ని సమర్పించడానికి ముందుకు వచ్చారు. త్వరలోనే ఆ బంగారాన్ని నిర్ణీత పద్ధతిలో సీఎం కెసీఆర్ గారి చేతుల మీదుగా స్వామి వారికి సమర్పిస్తామని ప్రకటించారు.
సీఎం కెసిఆర్ గారి ఆధ్యాత్మిక వజ్రసంకల్పానికి ఉడుతా భక్తిగా, తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా ఎంపీ తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ మొత్తం తెలంగాణనే బంగారు తెలంగాణగా మారుస్తున్నారని, అందులో భాగంగా జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల జీర్ణోద్ధరణ, చరిత్రాత్మక పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తూ పూర్వ వైభవం తెస్తున్నారన్నారు. అన్ని దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు తగు ఆర్థిక సాయం అందించారన్నారు.
ప్రత్యేకించి యాదగిరి గుట్టను యాదాద్రిగా సమున్నతంగా, శిల్పకళా సౌందర్యంతో, భక్తి పారవశ్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు శ్రీ యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారి దేవాలయానికి సిఎం కెసిఆర్ గారు చేస్తున్న కృషికి తోడుగా, తన వంతుగా ఉడుతా భక్తిగా కిలో బంగారాన్ని సమర్పించుకుంటామని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి వివరించారు. అలాగే, తన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలను కూడా సేకరించి సీఎం కెసీఆర్ గారి చేతుల మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి అందజేస్తామన్నారు.
హెటిరో చైర్మన్ పార్థ సారధి రెడ్డి 5 కిలోల బంగారం
ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పార్థసారధి రెడ్డి 5 కిలోల బంగారం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన కుటుంబం తరపున ఈ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణంలో తాము సైతం భాగస్వామం కావడం సంతోషంగా ఉందన్నారు.
కేసీఆర్ ఇటీవల చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఆలయ ప్రారంభోత్సవానికి ముహుర్తం పెట్టించారు. ఆ ముహుర్త పత్రాన్ని యాదాద్రి స్వామి పాదాల చెంత ఉంచారు.
పార్థసారథి రెడ్డి