ఇదం బ్రంహ్మం, ఇదం క్షాత్రం అన్నాడు పరశుధారి రాముడు
దశ శిరస్సుల వాడి తలలుత్తరించాడు ధనుర్ధారి రాముడు
గోకులంలో పెరిగి క్షాత్రం బోధించాడు బలరామానుజుడు
యవనుల నిరోధించాడు పురుషోత్తముడు
రాణా ప్రతాప సింహుడు పచ్చగడ్డి తిని పోరు కొనసాగించాడు
శివాజీ కొండల్లో దూరి సుల్తానులను మట్టి కరిపించాడు
అహింసా యోధుడు
రవి అస్తమించని సామ్రాజ్యానికి
చెమటలు పట్టించాడు.
ధర్మాన్ని వివరించేది బ్రాహ్మణ్యం
దాన్ని నిలబెట్టి నిర్వహించేది క్షాత్రం
క్షాత్రం లోపించిన జాతి నిర్వీర్యం
నిర్వీర్యమైన జాతి పరిరక్షించ లేదు బ్రాహ్మణ్యాన్ని
జాతికి జవ జీవాలు సమకుర్చే వారంతా నిరామయులై
క్షాత్రం కోల్పోయిన జాతికి మిగిలేది నిర్వేదం
మేలుకొలిపే ప్రయత్నం చేసాడు విశ్వనాధ ప్రతాప సింహుడు.
సింహంలా విజ్రుంభిస్తూ సాగుతున్నాడు ఓ పేదింటి మహారథుడు
విశ్వమంతా నీరాజనం పడుతున్న ఈ దేశ సేవకుడు
దశాబ్దాలుగా కదలని జగన్నాధ రధం కదిలించాడు
ప్రజా ద్రోహుల సహకారంతో ఖజానాలు కొల్లగొట్టిన వారిపై,
వ్యాపారం పేరుతో, అధికార దుర్వినియోగంతో దోచిన వారిపై
దేశం శరీరాన్ని మురికితో నింపుతున్న వారిపై
స్నేహ హస్తాన్ని కరచిన బయటి విద్రోహులపై
జనజీవితం కకావికలు చేసే అంతః శత్రువులపై
ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న కుటిలనీతి రాజకీయ వాదులపై
విద్యార్థులను, విద్యాలయాలను విధ్వంసక క్షిపణులుగా మార్చే వారిపై
అలుపెరగని పనితనంతో
అసమానమైన ఆలోచనా పుష్టితో
జాతిని నేడు నడిపిస్తున్నాడు ఓ బడుగుజాతి క్షత్రియుడు
రాజకీయ బహిష్కారానికి గురికాబోతున్నవారు
పొడిచే వెన్నుపోటును ఎదుర్కొంటున్నాడు
సైనికులతో పండుగలు పంచుకోవడం
చరిత్రకు తెలియని మెరుపుదాడులకు దోహదం
నిర్వహణా విభాగం జూలు విదిలించి గాండ్రిస్తోంది
ఎన్నడు చూడని పతకాలు తెస్తున్నారు మన ఆటగాళ్లు
రాజకీయం దూరంగా ఉంటె ఎంత ప్రగతో.
ఆర్ధిక స్వచ్చ భారతం కోసం సంస్కరణలకు
వెనుకంజ వేసినవారు సిగ్గు పడేలా చట్టాలు
ప్రపంచ దిగ్గజ దేశాలు నివ్వెర పోయేలా సవరణలు
తల్లి, తమ్ముళ్ళకు ప్రేమ మాత్రం పంచే సంస్కారం
ఇదీ క్షాత్రం
దీన్ని పెంచి పోషించే క్షాత్రం ఉందా మనలో?!
Also read: సాహిత్య ప్రయోజనం
Also read: ఏమైపోయాయ్
Also read: అన్వేషి
Also read: కుపిత
Also read: మేలుకో ఓటరూ!