- మమతా స్వయంకృత అపరాధం?
- పార్టీ ఫిరాయింపులతో విచ్ఛిన్నమౌతున్న బాంధవ్యాలు
- పశ్చిమ బెంగాల్ ముఖ చిత్రం
పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోడీ పర్యటనలో మమత బెనర్జీ తీరు విమర్శలకు గురైంది. ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తున్న బిజెపి కార్యకర్తల దూకుడు కు నిండు సభలో ఆమె అసహనం చూస్తే ఆమె ఓటమి భయంతో ఉన్నారని అర్థమౌతుంది. ఆమె నియంతృత్వ పోకడలపైన స్వయంగా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు మొదలయ్యాయి… కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన మమత తన కోట బద్దలు అవుతుంటే తట్టుకోలేక పోతున్నారు.
మమత వ్యతిరేక పవనాలు
గొప్ప విద్యావేత్త అయిన మమత “స్కూల్ పిల్లలా” వ్యవహారించడం చూస్తుంటే ఆమెను బెంగాల్ ప్రజలు దూరం పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది… ఇప్పుడు మమత వ్యతిరేక పవనాలు వీస్తున్న మాట వాస్తవం! దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా కేంద్రంలో కీలక మంత్రిగా సత్తా చూపిన మమత బెంగాల్ ను మార్చలేక పోవడం పెద్ద వైఫల్యం!! దుమ్ము పట్టిన కలకత్తా భవనాలకు దుమ్ము దులిపి రంగులు వేసుకుంటే ఇంటి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరడం చూస్తే కమ్యూనిస్టుల నుండి అధికారం అందుకోని ఇన్నేళ్లు రాజ్యమేలుతున్నా కూడా మమత కలకత్తా కు పట్టిన దుమ్ము ను దులపలేని స్థితిలో ఉన్నారా?…రాష్ట్ర రాజకీయాల్లో ఉవ్వెత్తున లేచిన అసమ్మతి ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కారణం. ఒకొక్కరు తృణమూల్ నుండి బీజేపీ వైపు అడుగులు వేస్తున్న స్థితి చూసి వీరు పదవీ వ్యామోహం తప్పా పనులు చేయని నేతలు అని బహిరంగంగా విమర్శించి మమత ఆబాసుపాలయ్యారు.
ఇది చదవండి: నేతాజీ వారసత్వం కోసం మోదీ, దీదీ బలప్రదర్శన
అప్పుడేమైనాయి నైతిక విలువలు
“రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి’ అని చెప్పే మమత కమ్యూనిస్టు నాయకులు, కాంగ్రెస్ నాయకులను తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ విలువలు ఏమయ్యాయి? తప్పుడు కేసుల్లో ఇరికించి కమ్యూనిస్టు, కాంగ్రెస్ నేతలను తన పార్టీలో చేర్చుకొని వాళ్ళు నిష్కలంక చరిత్రులను మంత్రులను ఎంపీల ను చేసి 2011 నుండి వారికి అగ్రస్థానం ఇచ్చిన మమత ఇవ్వాళ వారు దూరం అవుతున్నారని ఆక్రోశించడం విచిత్రం. నేతి బీర కాయలో నెయ్యి వైనం లాగా మమత నైతికత ఉన్నదని ఆమె ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
పార్టీల మార్పిడికి తెరలేపింది ఎవరు?
మొత్తం బెంగాల్ చరిత్రలో పార్టీ మార్పిడి తెర లేపింది మమత మాత్రమే. కరుడు గట్టిన వామ పక్ష నాయకులను కూడా తన పార్టీ వైపు మరల్చుకున్నారు. ఇప్పుడు ఆమె చేసిన పనే బిజెపి అగ్ర నేతలు నడ్డా, అమిత్ షా చేస్తున్నప్పుడు ఫిరాయింపుల పర్వాన్ని మమత జీర్నించుకోలేక పోతున్నారు. తృణమూల్ నుండి మొదట ముకుల్ రాయ్ తో బిజెపి కి వలస ప్రారంభం అయింది. బలమైన నేత సుబెందు అధికారి తో పాటు చాలా జిల్లాల్లో తృణమూల్ కేడర్ బిజెపి వైపు వెళ్ళిపోతోంది.. ఇదిలా ఉంటే బీజేపీ మద్దతుదారులను కూడా మమత తన పార్టీలోకి మార్చేలా ప్రలోభాలు చూపడం ఇక్కడ ఆశ్చర్యం.
రివర్స్ ఫిరాయింపు
బిజెపి ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత తృణమూల్ లో చేరడంతో ఆయన భార్యకు విడాకుల నోటీసు పంపారు. పశ్చిమబెంగాల్ రాజకీయాలు కుటుంబ విచ్ఛిన్నానికి కారణం అవుతున్నాయి. గమ్మత్తు ఆయన విషయం ఏమిటంటే కాంగ్రెస్ కుటుంబం నుండి వచ్చిన మమత అదే పార్టీతో బిజెపి ని అధికారం లోకి రానివ్వకుండా పొత్తు దిశలో ప్రయత్నం చేస్తోంది. వామపక్షాలను, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మమత వారితో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు విడ్డురమే. శాశ్వత శత్రుత్వం – మితృత్వం రాజకీయాల్లో ఉండదు అనే దానికి ఇదే నిదర్శనం.
ఇది చదవండి: నేతాజీ చుట్టూ బెంగాల్ రాజకీయాలు…ఎందుకంటే ?
తగ్గుతున్న మమత గ్లామర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2014 నుండి మమత గ్లామర్ తగ్గింది. ఆ ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోతుంది. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (ఎఐటిసి) పై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నిరంతరం ఓడిపోవడంతో, బిజెపి తనను రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలదొక్కుకుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. బిర్భూమ్ లోని బోల్పూర్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మమత పై రాజకీయ విమర్శలు మొదలు పెట్టారు. అదే సభలో సువేందు అధికారి ని బీజేపీలో చేర్చు కున్నారు ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన ఉండే వారు. ఆయన తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో రాజకీయంగా ప్రభావవంతమైన కుటుంబం నుండి వచ్చారు. గతంలో లోక్‌సభ ఎంపిగా ఉన్న అధికారి నందిగ్రామ్ ఎఐటిసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు – ఇది భూసేకరణ వ్యతిరేక పోరాటంతో ముడిపడి ఉన్న ఒక ప్రదేశం, భూసేకరణ ఉద్యమం తో 2011 లో 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఓటర్లు దూరం పెట్టారు. 2016 ఎన్నికల నుంచి బిజెపి తమ ప్రయోజనాల కోసం ఫిరాయింపులను పెంచింది.
బీజేపీ ప్రచారం
మమత బెంగాల్ కు చేసింది ఏమిలేదని మారుతున్న ప్రపంచం తో పశ్చిమ బెంగాల్ ను మార్చలేని కమ్యూనిస్టు లాగే మమత కూడా పయనించింది అని అందువల్లే చెన్నయ్, ఢిల్లీ , ముంబయి నగరాలకు దీటుగా కలకత్తా ఎదగలేక పోయిందనే మేధావుల విమర్శలను బిజెపి ఇప్పుడు ఎన్నికల సభలో వాడుతుంది. మమతా బెనర్జీ గతంలో రైల్వే మంత్రిగా రెండుసార్లు పనిచేశారు, అలా చేసిన మొదటి మహిళ కూడా ఈమె. ఆమె మొదటి మహిళా బొగ్గు మంత్రి, భారత ప్రభుత్వ మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి, యువజన వ్యవహారాలు, క్రీడలు, మహిళలు, బాలల అభివృద్ధి శాఖ మంత్రి గా పని చేశారు.
ఇది చదవండి: నందిగ్రామ్ బరిలో మమతా బెనర్జీ
సింగూరుతో మొదలు
సింగూర్‌లోని వ్యవసాయదారులు, రైతుల ఖర్చుతో ప్రత్యేక ఆర్థిక మండలాల కోసం పశ్చిమ బెంగాల్‌లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పారిశ్రామికీకరణ కోసం పూర్వపు భూసేకరణ విధానాలను వ్యతిరేకించిన తరువాత ఆమె ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2011లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కూటమికి ఘన విజయం సాధించిన బెనర్జీ, ఈ ప్రక్రియలో 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఓడించారు. ఇప్పుడు మతవాద పార్టీ గా ముద్ర వేస్తున్న బీజేపీ నుండి మమత గట్టి పోటీ ఎదుర్కొనే పరిస్థితులు కనబడుతూన్నాయి.