————————————————-
DO NOT LOVE HALF LOVERS (BY KAHLIL GIBRAN )
అనువాదం: డా. సి. బి.చంద్ర మోహన్
————- ———-————————–
అర్ధ ప్రేమికులని ప్రేమించకు
అర స్నేహానికి హస్తం చాపకు
అర నిపుణుల పనిలో తల దూర్చకు
అర జీవితం జీవించకు
సగం మరణించకు
మౌనం నీ కోరికైతే — అలాగే ఉండు
మాటాడదలిస్తే — పూర్తిగా మాట్లాడు !
చెప్పదలిస్తే — మౌనంగా ఉండకు
మౌనంగా ఉంటానికి — మాట్లాడకు !
(ఏదైనా ) అంగీకరిస్తే దృఢంగా చెప్పు
మాటలు — మింగేయకు !
(ఏదైనా) త్రోసిపుచ్చితే స్పష్టంగా ఉండు
సందిగ్ధ తిరస్కరణ అర్ధాంగీకారమే!
అర్ధ పరిష్కారాలు — ఆమోదించకు
అర్ధ సత్యాలు — విశ్వసించకు
అసంపూర్ణ స్వప్నాలు — కనకు
అర్ధ ఆశలతో — ఊహల ఊయల లూగకు
సగం నీరు దాహార్తి తీర్చదు
సగం భోజనం క్షుద్బాధ తీర్చదు
సగం దారి ఎక్కడికీ తీసుకుపోదు
సగం యోచన ఏ ఫలితమూ ఇవ్వదు!
నీవు ప్రేమించిన మనిషి
నీ రెండో సగం కాదు !
నీలో దాగున్న నీవే
నీ రెండో సగం
సగం జీవనం ఎప్పుడూ
పరిపూర్ణం కాదు!
నీవు చెప్పని మాట
వాయిదా వేసిన హాసం
పొందని ప్రేమ
తెలియని స్నేహం,
పయనం చేయటమే కానీ
గమ్యం చేరక పోవడం
పని చేయటం, చేయక పోవడం
మనసు లేకుండా హాజరవడం,
నీ సన్నిహితులకు నీవు ,
నీకు , వారు — కొత్తగా ఉండడం
ఇవన్నీ ” సగాలే”
ఈ సగం అనేది ఒక బలహీన క్షణం
నీవు సగం మనిషివి కావు
నీది అర్ధ జీవితం కాదు
పరిపూర్ణ జీవనం కోసమే
నీ పుట్టుక !
(Source: google)
Also read: నర్తకి
Also read: శాంతి – యుద్ధము
Also read: “నేతి”
Also read: వేదన
Also read: మూడు కానుకలు