భగవద్గీత – 49
మనం తలపెట్టిన పనిని ఎన్నిరకాలుగా పూర్తి చేయవచ్చును? దీని గురించి చెప్పే Possiblity thinking అని ఒక భావన ఉన్నది.
అవకాశాలు ఎన్నివిధాలు?
ఒక గుడి కట్టాలనుకోండి. అందుకు ఒక కోటి ఖర్చు అవుతుంది అనుకుందాం. మనదగ్గర డబ్బులు లేవు మరి ఎట్లా?
మనుషులు సహజంగా దైవాన్ని నమ్ముతారు. ఆ దైవకార్యమంటే ఎవరో ఒకరు చందా ఇస్తారు. కోటి రూపాయలు ఒక్కరే ఇచ్చే దాత దొరకవచ్చు. సగం ఇచ్చే వారు ఇద్దరు దొరకవచ్చు.
Also read: వివాహ వేడుకలో అపశ్రుతులు
నాలుగోవంతు ఇచ్చేవారు నలుగురిని చూడవచ్చు. ఇలాగ లక్ష చొప్పున ఇచ్చే వందమందిని కలిసి పనిపూర్తిచేసుకోవచ్చు. యాభై వేలిచ్చే రెండు వందల మందిని కలవవచ్చు.
పాతికవేలు, పదివేలు, వేయి ఇలా రకరకాల combinationsతో పనిపూర్తిచేస్తున్నారు. సత్సంకల్పం ఉన్నవారయితే గుడికి ఎంతయితే సరిపోతుందో అంతటితో ఆగి ఆపై వచ్చిన సొమ్మును గుడి నిర్వహణకు ఉపయోగిస్తారు. వారి సంకల్పాన్ని సందేహించవలసిన పనిలేదు. ఇక కొంతమంది ఉన్నారు, ఈ విధంగా గుడి కట్టడములో వ్యాపారము, అందులో లాభమూ చూసేవారు అన్నమాట. వారికి లాభము ఎలా వస్తుందో ఈ క్రింది లెక్కలు చూడండి.
లక్ష లింగాలు ప్రతిష్ఠ చేస్తున్నాం. మీ స్థోమతను బట్టి సైజు ఎంచుకోవచ్చు. చిన్న లింగమయితే 1,000 రూపాయలు, బాగా పెద్దలింగమయితే 10,000 రూపాయలు. లింగ ప్రతిష్ఠచేస్తే చేసిన పాపాలుపోయి పుణ్యం (credit) దక్కుతుందని నమ్మేవారు వీధికి పదివేలు.
Also read: మన ప్రవృత్తి ఏమిటి?
నావి తక్కువ పాపాలు కాబట్టి 1,000 రూపాయలే సరిపోతుందిలే అనుకుంటాడొకడు. ఎక్కవ చేశాను కాబట్టి 10,000 రూపాయలు పెడదాం అనుకుంటాడు ఇంకొకడు.
సరి మనం తక్కువ పాపాల వాళ్ళని లెక్కలోకి తీసుకుందాం.ఒక లింగం 1,000 రూపాయలు. లింగం అంటే రాయిని గుండ్రంగా grind చేయటమేగా! ఒక రాయికొని grind చేయటానికి 300 రూపాయలు అనుకొందాము. ప్రతిష్ఠ చేయించడానికి బ్రాహ్మడికి 200 రూపాయలు. మిగులు 500 రూపాయలు ఇలా ఒక లక్ష లింగాలు ప్రతిష్ఠ చేస్తే ఎంత లాభం. 5,00,00,000 అక్షరాలా అయిదుకోట్లు ఇది 1,000 రూపాయల లెక్క!
మరి ఎక్కువ పాపాలు పోగొట్టుకుందాం అని ఎక్కవపెట్టి లింగ ప్రతిష్ఠ చేసిన వారిని కూడా లెక్కలోకి తీసుకుంటే, దేవుడి పేరు మీద ఎంత లాభసాటి వ్యాపారమో చూడండి.
మిస్సమ్మ సినిమాలో ఒక పాటుంది. ‘‘పైనపటారం లోన లొటారం ఈ జగమంతా డంబాచారం, నీతులు పలుకుతు లోక విచారం’’ ఇలా సాగుతుంది… అంతేకదా!
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః
ఈహంతే కామభోగార్ధమ్ అన్యాయేనార్ధసంచయాన్!
ఆశాపాశంచేత ఎల్లప్పుడూ బద్ధులై కామక్రోధపరాయణులై ప్రవర్తిస్తారు, విషయ భోగ నిమిత్తమై అన్యాయ మార్గాల ద్వారా ధనార్జనకు పాలుపడతారు…
ఆసురీ ప్రవృత్తి అనంత రూపాల్లో ఇది ఒకటి!
Also read: మనం ఎటు పోతున్నాం?