మనసారా కోరుకున్నా
నెరవేరదని ఊరుకున్నా
కలల సైకతసౌధంపై
బూటుకాళ్ళతో నడిచారెవరో
దార్లు వెేరంటే చేసేది లేక లోకరీతి నడిచా
అనేక వసంతాల తర్వాత కోయిల మళ్ళీ కూసింది
నేను అఫలం కాదు సఫలం అని చెప్పింది
ధన్యత అంటే అప్పుడే తెలిసింది.
దూరాలు, అంతరాలు అంతరాయాలు తెచ్చాయి
మళ్లీ దార్లు వేరంటే
అడువారి మాటల అర్థం అప్పుడే తెలిసింది
నా మనసెప్పుడూ అన్నీ పంచుతూనే ఉంది
ఇన్నాళ్ళ తర్వాత నువ్వూ కాశ్మీర అనుభూతుల్ని
నాకు పంచినపుడు
రాగకమలం విప్పారింది
సాయుజ్యానికి దగ్గరలో.
Also read: కలి
Also read: జనవరి 26
Also read: నా రాత
Also read: మేధావి
Also read: అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం