* ఎలక్ట్రికల్ పారిశుద్ధ్య అంశాలు తొలగించారు
( ” సకలం ” ఎఫెక్ట్ )
Also Read : ఆలయ టెండర్ ప్రకటన లో అయోమయం, నిర్లక్ష్యమా? నిద్రమత్తా ?
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు తాము చేసిన పొరపాటును దిద్దుకున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ రీ టెండర్ ప్రకటన మార్చి మాసంలో తిరిగి జారీ చేశారు. కేవలం 59 అంశాలు ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తజనం రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. స్వామి వారికి నిత్య పూజ, నైవేద్యం, భక్తజనంకు ఉచిత భోజనం, లడ్డు, పులిహోర ప్రసాదం తయారీ తదితర అంశాలతో పాటు విద్యుత్ పరికరాలు, పారిశుద్ధ్య పరికరాలు, పదార్థాల, కొనుగోలు కోసం ( సంవత్సరకాలం పాటు సరఫరాకు ) ఆలయం పక్షాన టెండరు ప్రకటన జారీ చేయడం షరా మామూలే.
రెండు టెండర్ ప్రకటన జారీ లో ఓకే అంశాలు!!
గత నెల ఫిబ్రవరి మాసంలో దేవస్థానం వారు ఆర్ సి నెంబర్ 12/2021 తేదీ 02-02-2021 జారీచేసిన ఈ టెండర్, సీల్డ్ టెండర్ ప్రకటనలో 20 అంశాలు పేర్కొన్నారు. ఇందులో 15 అంశాలు సీల్డ్ టెండర్ ద్వారా సప్లై కి ఆహ్వానించారు. అందులో విద్యుత్, పారిశుద్ధ్య పరికరాలు, పదార్థాలను పేర్కొన్నారు. చివరి తేదీ 6/02/2021 గా టెండర్ ప్రకటన లో పేర్కొనబడింది.
Also Read : డాక్టర్ కొల్లూరు చిరంజీవి తెలంగాణ ఉద్యమకారుడే కాదు..తొలి నక్సలైట్ నాయకుడు !!
ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రకటనల్లోనూ అవే!
ఆర్ సి నెంబర్ 12/2021, తేదీ 11-02-2021 న ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ జారీ చేశారు ఇందులో లో ప్రారంభం తేదీ 12- 2 -2021. ముగింపు తేదీ 22-02-2021 టెక్నికల్ బిడ్ ఓపెనింగ్ తేదీ గా పేర్కొన్నారు. టెండర్ ఐడి No. 223337 గా పేర్కొన్నారు. ఈ ప్రకటనలో 108 సరుకుల అంశాలు సరఫరా చేయాల్సిందిగా పేర్కొనబడింది. ఈ టెండర్ ప్రకటనలో క్రమ సంఖ్య 62 నుంచి 89 వరకు పేర్కొన్న 29 రకాల అంశాలు విద్యుత్ పరికరాల కు సంబంధించినవి ఉన్నాయి. క్రమ సంఖ్య 90 నుంచి 108 వరకు పారిశుద్ధ్య పనులకు వినియోగించే పరికరాలు పదార్థాలను సరఫరా గురించి పేర్కొనబడి ఉంది.
సీల్డ్ టెండర్ ప్రకటనల్లోనూ, ఈ ప్రొక్యూర్మెంట్ ప్రకటనలోనూ విద్యుత్తు, పారిశుద్ధ్య పరికరాలు, పదార్థాలు పేర్కొనడం పట్ల 23 ఫిబ్రవరి సకలం లో “ఆలయ టెండర్ ప్రకటనలో అయోమయం ” శీర్షికన కథనం ప్రచురితమైంది.
Also Read : దళం లో చేరాడా ?
సరిదిద్దుకున్నారు
గతంలో జారీ చేసిన రెండు టెండర్ ప్రకటనలలో జరిగిన పొరపాట్లను ఆలయ అధికారులు గుర్తించి చడీ చప్పుడు కాకుండా తమ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మార్చి మాసంలో ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ రీ టెండర్ ప్రకటన జారీ చేశారు. టెండర్ ఐడి నెంబర్. 225697. Enquiry/IFB/ Tender Notice Number.B/12/2021. గా పేర్కొన్నారు . బీడ్ సమర్పణ ప్రారంభ తేదీ 02/03/2021 10 గంటలు ఉదయం నుంచి.. బిడ్ డౌన్లోడ్ ముగింపు తేదీ 6/03/2021 సాయంత్రం మూడు గంటల వరకు ప్రకటనలో పేర్కొనబడింది. బీడ్ ఓపెనింగ్ తేదీ 8/03/2021 గా ప్రకటనలో పేర్కొన్నారు.
59 సరకులకే ప్రకటన జారీ
ఫిబ్రవరి మాసంలో జారీ చేసిన ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రకటనలో 108 సరుకుల సరఫరాకు అందులో పేర్కొనబడింది. మార్చి మాసంలో జారీచేసిన రీ టెండర్లు ప్రకటనలు కేవలం 59 సరుకుల అంశాలు పేర్కొన్నారు. ఇందులో విద్యుత్తు, పారిశుద్ధ్య ,అంశాల, పరికరాలు పదార్థాలను తొలగించారు. గత ప్రకటనలో కొన్ని సరుకులకు బ్రాండ్లు పేర్కొనలేదు. ఈ ప్రకటనలో కొన్ని సరుకులు ఇలాంటి బ్రాండ్ వే సప్లై చేయాలి అంటూ పేర్కొనడం ప్రస్తావనార్హం. ఉదా:- శనగపప్పు (కెమెల్ బ్రాండ్ ) పంచదార (గాయత్రి) మినప్పప్పు ( తెనాలి, టు హార్స్ ) పెసరపప్పు (తిరంగా బ్రాండ్ ) రవ్వ ( షాలిమార్ ) తదితర బ్రాండ్లు పేర్కొనడం ప్రత్యేకం. ఫిబ్రవరి మాసంలో జారీచేసిన 2 టెండర్ ప్రకటనలో ఒకే అంశంకు సంబంధించినవి ఉండడం, అవి వివాదాస్పదం కాకుండా, న్యాయస్థానం కు చేరకముందే అధికారులు స్పందించి టెండర్ ప్రకటనలు జరిగిన పొరపాటు సరిదిద్ది రీ టెండర్లు జారీచేయడం తో భక్తజనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం