- ధర్మపురి నరసింహుడి డోలోత్సవం, తెప్పోత్సవం!!
- పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రధాన ఉత్సవాలు బ్రహ్మ పుష్కరిణిలో ఆదివారం శ్రీ స్వామివారి డోలోత్సవం, తెప్పోత్సవం, కన్నులపండువగా జరిగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఉత్సవంలో పాల్గొని స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేదపండితులు మంత్రి దంపతులను ఘనంగా వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి వారి శేష వస్త్రాలు బహూకరించారు.
Also Read: అంగరంగ వైభవంగా నరసింహుడి కళ్యాణం
జాతర ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణం పిదప శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఊరేగింపుగా స్థానిక బ్రహ్మ పుష్పాన్ని నీటిలో హంసవాహనంపై ఐదు ప్రదక్షిణాలు చేస్తూ, భక్తజనానికి దర్శనమివ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ తెప్పోత్సవ కార్యక్రమం తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తజనం తరలివచ్చి బ్రహ్మ పుష్కరిణి నలువైపుల ఆసీనులై తిలకిస్తుంటారు ( స్టేడియం తరహాలో ఉంటుంది )
అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పుష్కరిణి మధ్య మంటపంలో ఉయ్యాలలో ఊరేగిస్తారు. దీనిని డోలోత్సవం అంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తజనం గంటల తరబడి బారులు తీరి వేచి ఉంటారు భక్తులు స్వామివారి నిర్ణయించుకొని అనంతరం ఆలయానికి తరలి వెళ్తారు.
Also Read: ధర్మపురి నాట్యమండలికి 85 వసంతాలు
అన్నదానం !!
జాతర ఉత్సవాల సందర్భంగా వచ్చి భక్త జనం కోసం పాత తిరుమల తిరుపతి దేవస్థానం గదులు ఆవరణలో స్థానిక రైస్మిల్లర్స్ అసోసియేషన్, దాతల సహకారంతో ఉచిత అన్నదానం కొనసాగింది. ఉత్సవాలు జరిగినన్ని రోజులపాటు ఈ అన్నదానం కొనసాగుతోంది. స్థానిక గాయత్రి నిత్యాన్నదాన సత్రం మరియు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తజనం అన్న ప్రసాదం, మంచినీటి సౌకర్యాలు కల్పించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వర్గాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.