* జిల్లాల వారీగా ఎహెచ్ టియు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేసిన రాష్ట్ర పోలీస్ డిజిపి మహేందర్ రెడ్డి
* పాల్గొన్న జిల్లా పోలీసు అధికారులు, స్టేక్ హోల్డర్స్
మంచిర్యాల : మహిళల భద్రత, బాలల రక్షణ కోసం జిల్లాలో ఏర్పాటైన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసి మానవ అక్రమ రవాణా నేరాలను ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర పోలీస్ డిజిపి డాక్టర్ ఎం. మహేందర్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మహిళల రక్షణ విభాగం అడిషనల్ డీజీపీ శ్రీమతి స్వాతి లక్రా, డిఐజి బి. సుమతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర డిజిపి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల, బాలల సహాయం కోసం అనేక అత్యవసర ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని సహకరించాలని కోరారు. ఏ హెచ్ టి యూ, వ్యవస్థ జిల్లాల వారీగా పటిష్టంగా పనిచేయాలని ప్రతి గ్రామంలో సందర్శించి మహిళలకు చైతన్య పరచాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అన్యమత ద్వేషము తొలగించాలని సూచించారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలను చిన్నపిల్లలను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు సూచించారు.
Also Read : హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు
మహిళల భద్రతకు రామగుండంలో 6 షీటీమ్స్
ఈ సందర్భంగా డీసీపీ పెద్దపల్లి రవీందర్ గారు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమీషనరేట్ లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో మహిళల భద్రతకు జిల్లాలో 06 షి టీం బృందాలు పనిచేస్తున్నాయని, ఇతర శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణకు పటిష్టంగా కృషి చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ మహిళా రక్షణ విభాగం అదనపు డిజిపి శ్రీమతి స్వాతి లక్రా, డీఐజీ బి. సుమతి, రామగుండం పోలీస్ కమీషనరేట్ తరుపున పెద్దపల్లి డీసీపీ పి. రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ లు రాజ్ కుమార్, కిరణ్, సబ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్, షేక్ మస్తాన్,, బి. శశి దేవి డిఆర్ డీ ఓ, మంచిర్యాల, ఏం. నీరజ, DM &HO , మంచిర్యాల, రవుఫ్ ఖాన్, DWO, WCDYSC, రఫి మహ్మద్, ACL, ఎన్. ఆనంద్, DCPO, డాక్టర్ పి కృప, డే, DMHO, జి. రాజలింగు, నోడల్ ఆఫీసర్ Asst లేబర్ ఆఫీస్,కే. అర్షిత, osc,సఖీ, పెద్దపల్లి, పి కుమార్,DRDA, డి. నాగేశ్వర్ రావు, DDM పాల్గొన్నారు.
Also Read : సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్