నిజానికి
నాలుగేళ్ళ క్రితమే చనిపోయాడు
ఇవాళ సాంకేతికంగా
డాక్టర్లు నిర్ధారించారు
సహచరి మరణమే
అతని చివరి ఊపిరి.
ఒంటరితనం
అలలు లేని సముద్ర మథనం.
మా స్నేహం వయస్సు
అర్ధశతాబ్దం
ఇప్పుడది మనన నిశ్శబ్దం.
నన్ను మొదటిసారి
‘వేమనగోపి’ అని పిలిచింది అతడే
ప్రజాతంత్రలో
మిత్రుల కవితలకు
పట్టాభిషేకం కట్టాడు.
శివుడు అతనికి
తండ్రి కాని తండ్రి
ఖాన్ సాబ్ రూపంలో
కె.రామచంద్రమూర్తి.
రాసిన ప్రతి అక్షరం అద్భుతం!
మృత్యువును వెక్కిరిస్తున్న
మరకతం.
దేవీ! నీ లోటు
మిత్రులకు అశనిపాతం
చేతనయ్యిందొక్కటే
మా అశ్రుగీతం.
– డా.ఎన్. గోపి
(ప్రముఖ కవి దేవిప్రియ కోసం)
Also Read: దేవిప్రియ ఇక లేరు
Also Read: అంబేడ్కర్ రాజ్యాంగం డొల్లపదాల కలబోత కాదు : దేవిప్రియ