సంస్కృతి నాశన మార్గం
దేవాలయ విధ్వంసం
హరికథ, బుర్రకధ లాంటి
కళారూపాలు మరుగుపడడం
సంస్కృతానికి నీళ్లొదిలి
ఆంగ్ల భాషా పఠనం
అదీ ప్రాధమిక విద్యనుండి
తప్పని మాధ్యమం కావడం
మాతృభాషలో మాట్లాడితే శిక్షించడం
యూనిఫాం పేరున
మన కట్టు బొట్టు మట్టుపెట్టడం
చివరకు భాషరాక, పాఠంరాక
పనికి మాలిన పట్టాలకు
ఉద్యోగాలు రాని ఆక్రోశంతో
జులాయిగా తిరిగి విసిగి
టెర్రరిష్టుల్లా నక్షలైట్లలా మారే
యువతను చూస్తూ ఊరుకునే
మేధావులు, అధికారులు,
నాయకులు స్వాగతిస్తున్నారు
మన సంస్కృతి వినాశనాన్ని
తెల్ల జండాలతో.
Also read: నవ్వుల వీణ
Also read: మరో వసంతం
Also read: కామ దహనం
Also read: సమత
Also read: అప్పుడు