————–
ANIMALS
By
Whalt Whitman
తెనుగుసేత: డా. సీ.బి. చంద్రమోహన్
—————
ప్రశాంత, పరిపూర్ణ స్వేచ్ఛాజీవితంవారిది!
అనవసరపు ఆరాటాలు లేవు
విసుక్కోవడాలు ఉండవు
తన పాపాలను నెమరేసుకుంటూ
ఏడుస్తూ, చీకటి రాత్రులు గడపరు
దేవుడి యెడల నా విధులను గర్తుచేస్తూ
నన్ను రోగగ్రస్తుడిని చేయరు!
ఆత్మసంతృప్తి లోటేలేదు
అంతా స్వంతం చేసుకోవాలనే
దుర్బుద్ధి ఉండదు వారికి!
వారిలో,
ఎవరూ ఎవరికీ మోకరిల్లరు
వారి పూర్వీకులకు కూడా!
నేలతల్లిపై వారికి అసంతృప్తి లేదు!
నేలతల్లిపై వారికి అసంతృప్తి లేదు!
గౌరవాగౌరవాలకు అతీతులు వారు
వారికీ, నాకూ ఉన్న బంధమేమిటో
చూపిస్తారు వారు
నేను అంగీకరిస్తాను!
నా గత కాలపు జ్ఞాపకాల తునకలను
నాకు తెచ్చి ఇస్తారు!
అశ్రద్ధగా (ఎప్పుడో….గతంలో)
నేను పారేసుకున్న,
ఆ జ్ఞాపకాల పోగులు
ఆశ్చర్యంగా, వారి వద్ద చాలా ఉన్నాయి!
అందుకే వారిని చూసిన కొద్దీ
ఇంకా చూడాలనిపిస్తుంది!
ఆ జంతుజాలంలో
ఒకడినైపోవాలనిపిస్తుంది!
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి “తత్త్వాలు”
Also read: నా లోని నిజం
Also read: “స్వేచ్ఛ”—శృoఖలాలు
Also read: భాషణ