Tuesday, January 21, 2025

భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్

నవదీప్ సైనీ

  • గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీ
  • శ్రీలంకపై నిప్పులు చెరిగిన యువఫాస్ట్ బౌలర్

భారత్ అంటే ఒకప్పుడు స్పిన్ బౌలర్లకు చిరునామా. అయితే, కాలంతో పాటు భారత క్రికెట్లోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకొన్నాయి. ఒకరిద్దరు నామమాత్రపు ఫాస్ట్ బౌలర్ల నుంచి అరడజనుకు పైగా నాణ్యమైన అంతర్జాతీయ  ఫాస్ట్ బౌలర్లను తయారు చేసే స్థాయికి భారత క్రికెట్ ఎదిగిపోయింది.

యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, కట్టర్ల స్పెషలిస్ట్ మహ్మద్ షమీ, లంబూ పేసర్ ఇశాంత్ శర్మ, స్వింగ్ జాదూ భువనేశ్వర్ కుమార్, మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్, ముంబై థండర్ శార్దూల్ ఠాకూర్, తమిళనాడు సంచలనం నటరాజన్ లతో పాటు…ఢిల్లీ బుల్లెట్ నవదీప్ సైనీ సైతం భారత ఫాస్ట్ బౌలింగ్ అమ్ములపొదిలో చేరాడు. సిడ్నీ టెస్ట్ ద్వారా టెస్ట్ క్యాప్ సాధించడం ద్వారా తన కెరియర్ ను సార్థకం చేసుకొన్నాడు. కేవలం 28 సంవత్సరాల వయసులోనే భారత్ కు వన్డే, టీ-20 మ్యాచ్ లతో పాటు టెస్టుల్లోనూ ప్రాతినిథ్యం వహించిన ఘనత సొంతం చేసుకొన్నాడు. టెస్ట్ క్రికెట్లో భారత 299వ ఆటగాడిగా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

ఇది చదవండి: అపురూపం ఆ ఇద్దరి త్యాగం….!

అలా మొదలయ్యింది

ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా శ్రీలంకతో ముగిసిన 2019 సీజన్ తొలి టీ-20మ్యాచ్ లో యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ మెరుపువేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి టాపార్డర్ ను బెంబేలెత్తించాడు. ఢిల్లీ రంజీజట్టు ద్వారా దేశవాళీ క్రికెట్లోకి దూసుకొచ్చిన నవదీప్ సైనీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల బౌలర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా 2018 సీజన్లో ఐపీఎల్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో 3 కోట్ల రూపాయల ధరకు చేరాడు. అ తర్వాత భారత వన్డేజట్టులోనూ, ప్రస్తుత శ్రీలంక సిరీస్ ద్వారా టీ-20 జట్టులోను చేరగలిగాడు.

ఇది చదవండి: రహానేను ఊరిస్తున్న అరుదైన రికార్డు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నవదీప్

శ్రీలంకతో తన అరంగేట్రం తొలి టీ-20 మ్యాచ్ లో నవదీప్ సైనీ 4 ఓవర్లలో 13 డాట్ బాల్స్ తో..18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఓపెనర్ ధనుష్క గుణతిలకను 148 కిలోమీటర్ల వేగంతో విసిరిన యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా పెవీలియన్ దారి పట్టించాడు. అ తర్వాత..ఒషేడా ఫెర్నాండోను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో కూడిన బంతితో పడగొట్టాడు. భారత క్రికెట్లో ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని క్రమం తప్పకుండా అందుకొంటున్న ఏకైక ఫాస్ట్ బౌలర్ 28 సంవత్సరాల నవదీప్ సైనీ మాత్రమే.

ఇది చదవండి: నవదీప్ సైనీకి టెస్ట్ క్యాప్

భారత ఫాస్టెస్ట్ బౌలర్ బుమ్రా

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బౌల్ చేసిన ఫాస్ట్ బౌలర్ రికార్డు జస్ ప్రీత్ బుమ్రా పేరుతో ఉంది. గత ఏడాది ఆస్ట్ర్రేలియా పర్యటన సమయంలో బుమ్రా 153 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేసి…భారత ఫాస్ట్ బౌలర్ల సత్తా ఏపాటిదో ప్రపంచానికి చాటి చెప్పాడు. భారత ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లలో 152 కిలోమీటర్ల  వేగంతో బౌల్ చేసిన ఘనత ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మలకు సైతం ఉంది.

ఆల్ టైమ్ గ్రేట్ షోయబ్ అక్తర్

ఆధునిక క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా బౌల్ చేసిన బౌలర్ ప్రపంచ రికార్డు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరుతో ఉంది. 2003 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ముగిసిన మ్యాచ్ ల్లో షోయబ్ అక్తర్ గంటకు 163 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగాడు. ఈ ఘనత సాధించిన తొలిబౌలర్ గా చరిత్ర సష్టించాడు.

ఇది చదవండి: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles