రంగు రంగుల దీపావళి
ఆశల పూలు వెదజల్లే దీపావళి
నాకూ ఒకప్పుడుండేది దీపావళి
చిచ్చుబుడ్డిలా వెలిగే మొహంతో.
ఇప్పుడూ ఉంది దీపావళి అందరికీ
కాని నాలో ఆకాంతి లేదు
ఆ కాంతికోసం క్రాంతించే మనసు లేదు
ఉన్న మనసులో శాంతి లేదు.
ఉన్నదొక అంధకారం ఆవరించి
అందులో కోతి
కోతి మొగ్గలేస్తుంది
వెలికి రాక
వెలితితో వేగలేక
ఉండీ లేనిదైంది
ఉన్న మనసు.
మతాబా కాంతి కంటిదాకా చేరదు
కానీ చేయి మాత్రం చురుక్కు మంటుంది.
వెలిగించిన దీపాలు అల్లల్లాడుతుంటే
వాటి అలల్లో ఊగులాడే మనసుకు
చూస్తున్నా సంరక్షించే శక్తి లేదు
ఆరిపోయిన దీపాలు వెలిగించే ఆశా లేదు.
రేపటి దీపావళీ ఇంతేనా
కాదు. కాకూడదు.
నా జీవితంలో దీపాలు వెలిగించే
రాగమయి రావాలి
ఆ రాగ రాగంలో
జీవ సాగరంలో మునిగిపోవాలి
ఆ అరుణ కాంతిలో
నేను మిడతలా మాడిపోవాలి
అప్పుడే నాకు దీపావళి.
అదే నా లోని దీపావళి.
Also read:
రంగు రంగుల దీపావళి
ఆశల పూలు వెదజల్లే దీపావళి
నాకూ ఒకప్పుడుండేది దీపావళి
చిచ్చుబుడ్డిలా వెలిగే మొహంతో.
ఇప్పుడూ ఉంది దీపావళి అందరికీ
కాని నాలో ఆకాంతి లేదు
ఆకాంతికోసం క్రాంతించే మనసు లేదు
ఉన్న మనసులో శాంతి లేదు.
ఉన్నదొక అంధకారం ఆవరించి
అందులో కోతి
కోతి మొగ్గలేస్తుంది
వెలికి రాక
వెలితితో వేగలేక
ఉండీ లేనిదైంది
ఉన్న మనసు.
మతాబా కాంతి కంటిదాకా చేరదు
కానీ చేయి మాత్రం చురుక్కు మంటుంది.
వెలిగించిన దీపాలు అల్లల్లాడుతుంటే
వాటి అలల్లో ఊగులాడే మనసుకు
చూస్తున్నా సంరక్షించే శక్తి లేదు
ఆరిపోయిన దీపాలు వెలిగించే ఆశా లేదు.
రేపటి దీపావళీ ఇంతేనా
కాదు. కాకూడదు.
నా జీవితంలో దీపాలు వెలిగించే
రాగమయి రావాలి
ఆ రాగ రాగంలో
జీవ సాగరంలో మునిగిపోవాలి
ఆ అరుణ కాంతిలో
నేను మిడతలా మాడిపోవాలి
అప్పుడే నాకు దీపావళి.
అదే నా లోని దీపావళి.
Also read:
రంగు రంగుల దీపావళి
ఆశల పూలు వెదజల్లే దీపావళి
నాకూ ఒకప్పుడుండేది దీపావళి
చిచ్చుబుడ్డిలా వెలిగే మొహంతో.
ఇప్పుడూ ఉంది దీపావళి అందరికీ
కాని నాలో ఆకాంతి లేదు
ఆకాంతికోసం క్రాంతించే మనసు లేదు
ఉన్న మనసులో శాంతి లేదు.
ఉన్నదొక అంధకారం ఆవరించి
అందులో కోతి
కోతి మొగ్గలేస్తుంది
వెలికి రాక
వెలితితో వేగలేక
ఉండీ లేనిదైంది
ఉన్న మనసు.
మతాబా కాంతి కంటిదాకా చేరదు
కానీ చేయి మాత్రం చురుక్కు మంటుంది.
వెలిగించిన దీపాలు అల్లల్లాడుతుంటే
వాటి అలల్లో ఊగులాడే మనసుకు
చూస్తున్నా సంరక్షించే శక్తి లేదు
ఆరిపోయిన దీపాలు వెలిగించే ఆశా లేదు.
రేపటి దీపావళీ ఇంతేనా
కాదు. కాకూడదు.
నా జీవితంలో దీపాలు వెలిగించే
రాగమయి రావాలి
ఆ రాగ రాగంలో
జీవ సాగరంలో మునిగిపోవాలి
ఆ అరుణ కాంతిలో
నేను మిడతలా మాడిపోవాలి
అప్పుడే నాకు దీపావళి.
అదే నా లోని దీపావళి.
Also read: అర్పణం
Also read: చవటాయ్
Also read: బాగుపడాలంటే
Also read: గమ్యం
Also read: ఆకలి కేక