- తగ్గిన మేడారం హుండీ రాబడి
- గత ఏడాది 11 కోట్ల 64 లక్షల ఆదాయం
మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తి అయింది. ఈసారి హుండీల ఆదాయం రూ. 11 కోట్ల 44 లక్షలు 12వేల 707 రూపాయలు వచ్చింది. కాగా ఇంకా అమ్మవార్లకు కానుకల ద్వారా బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోల 350 గ్రాములు లభ్యమైంది. చిల్లర నాణేల రూపంలో 37 లక్షలుసమకూరాయి. 2020 జాతర కంటే ఈసారి మేడారం హుండీ ఆదాయం కొద్దిగా తగ్గింది. గత జాతరలో 11 కోట్ల 64 లక్షల ఆదాయం, బంగారం ఒక కేజీ 63 గ్రాముల 900 మిల్లీలు, వెండి 53 కేజీల 450 గ్రాములు.