ఎన్నికలు జరుగుతున్నాయంటే రాజకీయ పార్టీలకంటే ఒపీనియన్ పోల్స్ పేరుతో ఏజెన్సీలు చేసే వారి హడావుడే ఎక్కువ. ఒక్కో ఏజెన్సీ ఒక్కో రకమైన ఫలితాలను ప్రకటిస్తుంటుంది. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో పలు ఏజెన్సీలు అభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. ఒక సంస్థ లేదా టీవీ ఛానల్ చేసే అభిప్రాయసేకరణ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కానీ పలు ఏజెన్సీలు ఇచ్చిన ఫలితాల ఆధారంగా న్యూస్ ఛానళ్లు చర్చలు, విశ్లేషణలు నిర్వహిస్తూ సామాన్య ఓటర్లను గందరగోళానికి గురి చేస్తారు. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్, ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఓటింగ్ ను ప్రభావితం చేస్తాయా? ఇది చర్చించాల్సిన అంశం. ఇందిరా గాంధీ జీవించి ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలు ఆమెకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించాయి. కచ్చితంగా ఓడిపోతారంటూ ఎన్నికల ఫలితాల ముందే జోస్యం చెప్పాయి. కాని తీరా ఫలితాలు మాత్రం ఇందిరా గాంధీకి ఘన విజయం అందించాయి. మీడియా అనేది ప్రజల మానసిక స్థితిని కొంతవరకు మాత్రమే అంచనావేయగలదు.
Also Read: బెంగాల్ పై దృష్టి కేంద్రీకరించిన బీజేపీ
రాజకీయ పార్టీలు క్షేత్ర స్థాయిలో బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి అభిప్రాయ సేకరణలు ఉపయోగపడతాయి. తటస్థ ఓటర్ల అభిప్రాయాలను ఓటింగ్ ప్రాధాన్యతలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి అవి అంతగా ఉపకరించవు. ప్రముఖ రచయిత, అధ్యాపకులు, ప్రొఫెసర్ కెవిఎన్ రావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై చేసిన రచనలు, ఒప్పందాలు విభేదాలు, నిరాశలపై రాసి నాకు మెయిల్ చేశారు. ఎన్నికల ముందు అభిప్రాయ సేకరణ చాలా తక్కువమంది ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే సూచిస్తుంది. అది కూడా ఏజెన్సీలు కొన్ని ఎంచుకున్న నియోజకవర్గాలలో కొద్ది మంది నుంచి మాత్రమే అభిప్రాయ సేకరణ చేస్తుంటారు. ఒక పార్టీ దాని బలాలు, బలహీనతలు తెలుసుకుని వ్యూహాలు రూపొందించుకోవాడానికి ప్రత్యర్థులకు దెబ్బకొట్టడానికి ఈ సర్వేలను ఉపయోగించుకోవచ్చు. ఏ పార్టీకి చెందని తటస్థులు తమ ఓటును విజేతగా భావించే వారికే వేస్తారు. విజేతను అంచనావేసేందుకు ఏజెన్సీలు, న్యూస్ ఛానల్స్ ఒకదానికొకటి పోటీపడటం అవసరమా? పైగా వీటిపై గంటలకు గంటలకు టీవీలలో చర్చలు పెడతాయి. అసలు ఇలాంటి సర్వేలు నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు
సకలం డిబేట్ లో పాల్గొన్నవారు మీ అభిప్రాయాన్ని ‘కామెంట్’ ద్వారా తెలియజేయండి, లేదా మెయిల్ చేయండి మా మెయిల్ ఐడీ [email protected]