Photo writeup: రాబర్డ్ ఎపెన్ హీమర్, అణుబాంబు పితామహులలో ఒకరు
భగవద్గీత – 38
University of Californiaలో Theoretical Physics Professorగా పనిచేసి అణుబాంబు పితామహులలో ఒకడుగా కొనియాడబడ్డ Dr J Robert Oppenheimer అన్నమాట ఒకటి చెప్పాలనిపిస్తోంది!
హిరోషిమా, నాగసాకి మీద అణుదాడికి ముందు ఒక అణుపరీక్ష జరిగింది. ఆ పరీక్ష అయిన తరువాత ఆయన మదిలో కదిలిన, మెదిలిన భావాలివి. అవి భగవద్గీత నుండే కావటం గమనార్హం.
Now, I am become Death, the destroyer of worlds….
ప్రాధమిక దశలో ఉన్న అణుబాంబు పేల్చినప్పటి భావన అది.
ఇవ్వాళ మానవుడు అంతకు ఎన్నో రెట్లు అధిక శక్తికలిగిన బాంబులు తయారు చేసుకొన్నాడు.
ఆయనకు స్ఫురణకు వచ్చిన శ్లోకం ఇదిగో…
కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః
ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే
యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః
నేను లోకాలన్నిటినీ తుదముట్టించడానికై విజృంభించిన మహాకాలుడను, ఇప్పుడు ఈ లోకాలు రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమందున్న ఈ వీరులెవ్వరూ మిగులరు.
ఇన్ని వేలబాంబులు (War heads) తయారుచేసుకొని వాటిమీద కూర్చొని అభివృద్ధి, శాంతి అంటూ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న నేటి నాగరీకపు నవమానవుడిని చూసి నవ్వాలనిపిస్తుంది కదూ!