శ్రీశ్రీకి వందనశ్రీలు. 1983 జూన్ 15 వ తేదీన ఆ మహాకవి మరోప్రపంచానికి మహాప్రస్థానం చేసిన రోజు. అవి నేను ఇంటర్ చదువుతున్న పసినాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం వంటి కావ్యాలు రాశాడని అస్సలు తెలియని నా తొలినాళ్ళు. తెలిసింది ఒక్కటే.. ఆయన గొప్ప సినిమాకవియని. ఆ పాటలన్నీ నాకు ఇష్టమే. ఆ జాబితా చాలా పెద్దది. ఆ పదాలు మత్తు గమ్మత్తుగా అనిపించేది. అందులో శృంగార, వీర రసాలు పొంగి పొరలేవి. గొప్ప చైతన్యం లోలోపల ప్రవహించేది, తెలియని అనందమేదో తట్టిలేపేది. ఈ ప్రభావంతో… శ్రీశ్రీ మరణించినప్పుడు నేను తొలిసారిగా కవిత రాశాను, అది కూడా ఆయన పైనే. తర్వాత ఎప్పుడూ ఎవరిపైనా రాయలేదు. వయస్సు పెరిగిన తర్వాత మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, సిప్రాలి, అనంతం మొదలైనవి కాస్త చదివాను. శ్రీశ్రీ = శ్రీశ్రీ