ఫొటో రైటప్: దాశరథి, ఘంటసాల
ఘంటసాల భక్తికరమైన పాట. సంగీతభరమైన గానం. వారితో సమానమైన అందమైన గాత్రం ఎస్ జానకి పాట. ఇక వారికి మించిన రచన చేసిన కవి దాశరథి. మహాకవి. స్వాతంత్ర్య సమరయోధుడు, అద్భుతమై కీర్తన రచించిన దాశరథి. ఇదివరకు పెద్దలు రచించిన వాగ్గేయవాడనగలిగినంత గొప్ప రచన ఇది…
నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళా
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
ఏడెడు శిఖరాలు నే నడువలేను .. ఏ పాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను… నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా..ఆ..ఆ..ఆ.. మము గన్న మాయమ్మా అలివేలుమంగా
మము గన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
కలవారినేగాని కరుణించలేడా.. నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు.. స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగ వల్లి .. అడగవె మాయమ్మ అలివేలుమంగా
నడిరేయి ఏ జాములో.. స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో…
ఈ గీత రచనలో దాశరథి అమ్మను కోరుకుంటున్నాడు. పురుషాకారం బాధ్యత తీసుకున్నారు అమ్మ. ఆ తల్లి అలమేలుమంగమ్మ కరుణించమని తండ్రి వేంకటేశుని ఆ తండ్రిని కూతురిని వేంకటేశుని ద్వారా రికెమెండ్ చేస్తున్నారు. దీన్ని పురుషాకారం అంటారు. వేంకటేశుడింకా కఠినంగానే ఉన్నాడు. కరగలేడు. అందుకుని దాశరథి కరుణించాలని అలమేలు మంగమ్మ ద్వారా వేంకటేశుని దయ చూపమని అడుగుతున్నాడు. చాలా గొప్ప పాట. శ్రీవైష్ణవ లక్షణాల్లో నడిరేయి ఏ జాములో.. ఇది లక్షణం కలిగిన దాశరథి రచన. గొప్ప గానం, ఘంటసాల కలకాలం నిలిచిపోయిన పాట, అందరు కలిసి అద్భుతంగా నిర్మించినప్పటికీ, దాశరథి లేకపోతే ఈ పాట నిలబడదు. ఆ దాశరథికి జోహార్లు.
దాశరథి రచించిన పాటకు వపా వల్లాది పాపయ్యగారు గీసిన అద్భుత వర్ణచిత్రం