Sunday, December 22, 2024

విధి విలాసం

చంద్రబింబంలాంటిమోము

వన్నెల జాలువారే కళ్ళు

నల్లటి నిగనిగల మేనిరంగు

నిటారుగా నిలుచున్న నాసిక

తేనెల బావిని తలపించే పెదాలు

సంగీత జలపాతం లాంటి నవ్వులు

లావణ్య సౌందర్యం నిండిన

ముగ్థమోహనరూపం

నా చెలి సొంతం

రాగరంజితమైన మనసు

సంస్కారసౌందర్యంతో కూడిన తలపులు

సౌకుమార్యం నిండిన నడక

సున్నితత్వం మూర్తీభవించిన నడవడి

మార్దవం నిండిన భాషణం

నా చెలి సొంతం

ప్రజ్ఞ, ప్రతిభ పోటీపడతాయి తనతో

వినయం, వివేకం వెల్లవవుతాయి తన వ్యక్తిత్వంలో

మనసు, బుద్ధి శోభితమవుతాయి ఆమె చూపుతో

ఆలోచన, అభివ్యక్తీకరణ ఆకర్షణీయంగా వుండే

సకల సద్గుణాల భూషణాలు

నా చెలి సొంతం

 చెలి కోరుకున్నా నా సొంతం కాలేకపోవడం

విధి విలాసం

Also read: గుమ్మడి పువ్వు

Also read: క్షాత్రం

Also read: సాహిత్య ప్రయోజనం

Also read: ఏమైపోయాయ్

Also read: అన్వేషి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles