ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఏఐసీసీ అద్యక్షుడు దివంగత దామోదరం సంజీవయ్య 100వ జయంతి కార్యక్రమము జరిగి 24 గంటలు కూడా కాలేదు.. నాంపల్లిలో అసెంబ్లీ సమీపంలోని ఆయన విగ్రహానికి జి.హెచ్.ఎం.సి అధికారులు ఏర్పాటు చేసిన పూల అలంకరణనూ, దామోదరం సంజీవయ్య కు వేసిన పూల మాలలనూ మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
విషయం తెలుసుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత, దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ వి.హనుమంత రావు అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇలా శత జయంతి జరిగి 24 గంటలు కూడా జరగక ముందే దామోదరం సంజీవయ్య విగ్రహానికి, విగ్రహం వద్ద ఉన్న పూల అలంకరణ తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన నిస్వార్థ వ్యక్తికి ఇదేనా ప్రభుత్వ మర్యాద అని వి.హెచ్ అధికారలును ప్రశ్నించారు. విషయం తెలుసకున్న మున్సిపల్ సిబ్బంది ఒక పూల మలను తెచ్చి కాటే సహాయంతో దామోదరం సంజీవయ్య కు వేశారు.
ఒక దళిత ముఖ్యమంత్రిగా, దళిత నాయకుడి శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ తరపున చేయమని సీఎం కు ఎన్ని లేఖలు రాసిన కనీసం దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద ఇనుప మెట్లు కూడా ఏర్పాటు చేయలేదని వి.హెచ్ ఆవేదన వ్యక్తంచేశారు.
నిజానికి సంజీవయ్య జయంతి సందర్భంగా తెలుగు రాజకీయ నాయకులందరూ ఆయన విగ్రహానికి పూలమాల వేయాలి. కాంగ్రెస్ నేతలు కూడా అంతగా పట్టించుకోలేదు. సోమవారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మణిక్కం టాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాంపల్లి ఫతేమైదాన్ క్లబ్ దగ్గర సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేశారు. కొందరు నాయకులు నక్లెస్ రోడ్డులో సంజీవయ్య సమాధిని సందర్శించారు. ఆ తర్వాత గాంధీనగర్ లో కోదండ్ రెడ్డి ఆధ్వర్యంలో సంజీవయ్య నగర్ లో నివాళి కార్యక్రమానికి హాజరైనారు. కానీ చాలామంది సీినియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరాభవన్ లో జరిగిన శతవార్షికోత్సవ ముగింపు సమావేశానికి హాజరు కాలేదు. తొలి దళిత మంత్రి తెలుగువాడనీ, ఆయనను నెహ్రూ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే, ఇందిరాగాంధీ రెండోసారి ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించారనీ చెప్పుకోవడం కూడా కాంగ్రెస్ నేతలకు చేతకావడం లేదు. కాంగ్రెస్ లో దళితనేతలు గీతారెడ్డి, భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ వంటివారు ఇందిరాభవన్ కు వస్తే బాగుండేది. రాకపోవడం అన్యాయం. తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరూ తెొలి దళిత ముఖ్యమంత్రినీ, రెండు సార్లు ఏఐసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ఒకే ఒక తెలుగు నాయకుడినీ ఆయన 101వ జయంతినాడు స్మరించుకోకపోవడం సిగ్గుచేటు.
Also read: కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి : వీహెచ్