Representative photo
724 గదిలో
మోగని టీవీ
అప్పుడప్పుడు తలుపులు తోసుకుంటూ తెల్ల దుస్తుల్లో అమ్మాయిలు
తలకిందులుగా మందులందిస్తూ
శ్వేత పారదర్శక ద్రవాలు
మంచం మీద ఆమె
కొత్త మోకాలు చిప్పతో
ఎంతో నొప్పితో
కవిత్వం వినిపిస్తూ నేను
చాలా రోజులకి తీరికగా
కవిత్వం కలిసి చదువుకునే సన్నివేశం
దవాఖానా అయినా
ఇల్లయినా
కవులకి కవిత్వమే ఆహారం కదా!
పేన్ కిల్లర్లు పారాసిటమాల్లే కాదు
ఓ రెండు కవితా చరణాలూ
చల్లని లేపనమై
బాధ ను మరిపిస్తాయి కదా!
Also read: ఒకప్పుడు …
Also read: నో …ఓపెన్ సెసేం
Also read: బ్రహ్మకమలం
Also read: నాలుగు పాదాల మీద న్యాయం …
Also read: ప్రార్ధన