- నాలుగోరోజునా సిడ్నీటెస్టులో అదే సీన్
- మార్పులేని కంగారూ దురభిమానుల వైఖరి
సిడ్నీటెస్ట్ నాలుగోరోజు ఆటలోనూ ఆస్ట్ర్రేలియా అభిమానుల జాత్యంహకార వ్యాఖ్యల పర్వం కొనసాగింది. ఆట మూడోరోజున భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ ల పట్ల సిడ్నీ స్టేడియం స్టాండ్స్ లోని కొందరు అభిమానులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అనుచితంగా ప్రవర్తించడంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ అధికారికంగా మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. సమాధానంగా, జరిగినదానికి విచారిస్తున్నామంటూ క్రికెట్ ఆస్ట్ర్రేలియా భారత క్రికెటర్లను క్షమాపణ కోరింది. అయితే ఈ వివాదం సద్దుమణగక ముందే నాలుగో రోజు ఆటలో సైతం కొందరు కంగారూ అభిమానులు క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు.
Also Read : భారత్ ఎదుట భారీ లక్ష్యం
ఆట రెండో సెషన్లో బౌండ్రీలైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ను స్టేడియం స్టాండ్ లోని కొందరు అభిమానులు జాత్యహంకారపూరిత వ్యాఖ్యలతో గేలి చేసి వేధించారు. దీంతో సిరాజ్ తన కెప్టెన్ ద్వారా ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఆటను కొంతసేపు నిలిపివేశారు.
కరోనా నిబంధనల కారణంగా అభిమానులు మాస్క్ లు ధరించి స్టేడియానికి రావడం తప్పనిసరి చేశారు. ఈ అవకాశాన్నికొందరు కంగారూ అభిమానులు దురభిమానంగా మార్చారు. మాస్క్ల్ లు ధరించి జాతివివక్ష వ్యాఖ్యలు చేస్తూ భారత క్రికెటర్లను వేధించడం కొనసాగించారు.
Also Read : ఆస్ట్రేలియా అభిమానుల జాత్యహంకార జాడ్యం
అంపైర్ల ఫిర్యాదుతో స్టేడియం స్టాండ్స్ లోకి ప్రవేశించిన పోలీసులు.. అనుచితంగా ప్రవర్తించిన కొందరు అభిమానులను గుర్తించి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. సిడ్నీ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 50 వేలు కాగా కోవిడ్ నిబంధనల ప్రకారం రోజుకు 10వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఖాళీ స్టేడియంలో అదీ కేవలం 10వేల మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ జరిగినా వివాదం చోటు చేసుకోడం శోచనీయం.
Also Read : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి జడేజా అవుట్