- కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక
- కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు
దేశంలో అత్యంత వేగంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది. మాస్క్ లు సక్రమంగా ధరించాలని ముక్కు నోటిపైనే ఉండాలని సూచించింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆర్టీ పీసీఆర్ పరీక్షలు పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో ఉంచాలని తెలిపింది. దేశవ్యాప్తంగా 10 జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నయాన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఇందులో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండటం వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో కళ్లకుకడుతోంది.
యాదాద్రి ఆలయంలో ఆర్జితసేవల రద్దు:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా 266 మందికి పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో 10 మంది ఆలయ సిబ్బంది అర్చకులు ఉన్నారు. దీంతో తాజాగా వైరస్ సోకిన ఉద్యోగులతో కలిపి ఇప్పటివరకు వైరస్ బారినపడిన ఆలయ ఉద్యోగులు అర్చకుల సంఖ్య 83కి చేరింది. యాదగురిగుట్ట మండలంలో కేవలం ఆరు రోజుల్లో 141 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆలయంలో వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్నందున స్వామి వారి ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 3 వరకు ఆర్జిసేవలు, అన్న ప్రసాదం నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు లఘు దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారు. భక్తులు లేకుండానే స్వామివారికి ఏకాంతంగా దైవారాధనలు ఇతర పూజాదికాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు
ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్:
మరోవైపు ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులైనవారు కొవిన్ యాప్ లో ముందస్తుగా నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటల తరువాత నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్ళి అక్కడే రిజస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ పొందొచ్చని ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదీ చదవండి:విమానాశ్రయాల్లో మాస్క్ ధరించకుంటే ఇంటికే