* ముఖాముఖీ రికార్డుల్లో చెరి సగం
* టీ-20ల్లో టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్, రెండోర్యాంకర్ భారత్
ధూమ్ ధామ్ టీ-20 విభాగంలో ప్రపంచ మొదటి రెండుర్యాంక్ జట్లు ఇంగ్లండ్- భారత్ మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ పతాకస్థాయికి చేరింది. సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లో చెరో రెండు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో..విజేతను నిర్ణయించే ఆఖరి సమరానికి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా రెండుజట్ల ముఖాముఖీ రికార్డులు ఓసారి తిరగేస్తే సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి.
భారత్ 9- ఇంగ్లండ్ 9
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్- ఇంగ్లండ్ జట్ల్లు ప్రస్తుత సిరీస్ లోని మొదటి నాలుగు మ్యాచ్ లతో కలుపుకొని ఇప్పటి వరకూ 18సార్లు తలపడ్డాయి. చెరో 9 విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయి. తటస్థ వేదికల్లో ఇంగ్లండ్ తో తలపడిన రెండుకు రెండుసార్లూ భారతజట్టే విజేతగా నిలిచింది.
Also Read : భారత వన్డేజట్టులో సూర్య, నటరాజన్
2007 డర్బన్, 2012 కొలంబో టీ-20 మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ ను భారత్ కంగు తినిపించింది. భారత్ వేదికగా ఈ రెండుజట్లూ 10మ్యాచ్ ల్లో తలపడితే…చెరో ఐదు మ్యాచ్ లూ నెగ్గి 5-5తో సమఉజ్జీలుగా ఉన్నాయి.
2012 పూనే, 2017 నాగపూర్, 2017 బెంగళూరు మ్యాచ్ ల్లో భారత్ పై ఇంగ్లండ్ జట్టే పైచేయి సాధించింది.2011 కోల్ కతా, 2012 ముంబై, 2017 కాన్పూర్ టీ-20 మ్యాచ్ ల్లో భారత్ విజేతగా నిలిచింది.
Also Read : నాలుగో టీ-20లో సూర్యప్రతాపం
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదు మ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లో …రెండుజట్లు చెరో రెండుమ్యాచ్ లు నెగ్గి 2-2తో సమఉజ్జీలుగా ఉన్నాయి.
ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ తో ఆరుసార్లు తలపడిన భారత్ రెండంటే రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. 2018 సిరీస్ లో భాగంగా మాంచెస్టర్, బ్రిస్టల్ వేదికలుగా జరిగిన మ్యాచ్ ల్లో నెగ్గిన భారతజట్టు…2009 లార్డ్స్, 2011 మాంచెస్టర్, 2014 బర్మింగ్ హామ్, 2018 కార్డిఫ్ మ్యాచ్ ల్లో పరాజయాలు చవిచూసింది.
ఈ రోజు జరిగే ఆఖరిమ్యాచ్ లో నెగ్గిన జట్టే ముఖాముఖీ రికార్డుల్లో 10-9 రికార్డుతో పైచేయి సాధించడం తో పాటు…సిరీస్ విజేతగానూ నిలువగలుగుతుంది.
Also Read : ప్రో-బాక్సింగ్ లో సింగ్ ఈజ్ కింగ్