దేశంలో ఓటర్ ఐడీతో.. ఆధార్ నంబర్‌ను లింక్ చేయనున్నారు. వ్యక్తుల ఇష్ట ప్రకారమే వాలంటీర్‌గా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల్లో భాగంగా.. తాజా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా, ఓటింగ్ ప్రక్రియ, EC అధికారాల్లో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. బోగస్ ఓట్ల తొలగింపే లక్ష్యంగా బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఏడాదిలో 4సార్లు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.