కరోనా స్ట్రెయిన్
- అతివేగంగా వ్యాపిస్తున్న కరోనా స్ట్రెయిన్
- భారత్ లో పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులు
- లాక్ డౌన్ దిశగా పలు దేశాలు
- గణతంత్ర దినోత్సవాలకు హాజరుకాలేనన్న బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచమంతా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. తొలి వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. రోజుకో దేశంలో స్ట్రెయిన్ వైరస్ వ్యాపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే 41 దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సార్స్ కోవ్ తో పోలిస్తే బ్రిటన్ రకం కరోనా 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచదేశాలు బ్రిటన్ కు మరోసారి విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే బ్రిటన్ లో బయడపడ్డ కరోనా స్ట్రెయిన్ కాకుండా నాలుగు రకాల వైరస్ లు బయటపడినట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఇది చదవండి: భారత్ లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్
లాక్ డౌన్ విధిస్తున్న పలు దేశాలు
ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం స్ట్రెయిన్ కట్టడికి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. మరిన్ని దేశాలు కూడా లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. జర్మనీలో జనవరి 10 వరకు నిత్యావసరాల మినహా అన్ని వాణిజ్య సంస్థలను మూసి వేయాలని ఆదేశించింది. యూకే విమానాలపై జర్మనీ ప్రభుత్వం గతంలో ఉన్న నిషేధాన్ని పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్కాట్లాండ్ ప్రధాని నికోలా లాక్ డౌన్ విధించారు. లాడ్ డౌన్ సమయంలో ప్రజలందరూ కూడా ఇంటి వద్దనే ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. విద్యాసంస్థలు, ప్రార్ధనా మందిరాలు, జిమ్‌లు మూసివేయాలని ఆదేశించారు. నెదర్లాండ్స్ ప్రభుత్వం జనవరి 19 వరకు పాక్షిక లాక్ డౌన్ విధించింది. ఆస్ట్రియా ప్రభుత్వం జనవరి 24 వరకు రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్ని మూసేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా, పోలాండ్‌లో జనవరి 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఇప్పటి వరకు వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ఐర్లండ్ లో కూడా భారీగా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వియత్నాం ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నిషేధించింది. టర్కీలో ఒక్కరోజే 15 కేసులు నమోదు కావడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇప్పటికే కరోనాతో అతాకుతలమవుతున్న అమెరికలో కొత్త రకం వైరస్ మరింత అలజడి సృష్టించే ప్రమాదం ఉందన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కరోనా రోగులతో ఇప్పటికే నిండిపోయిన అమెరికా ఆసుపత్రుకు ఇది పెనుసవాల్ గా పరిణమించనుంది.
ఇది చదవండి: కొవాగ్జిన్ కోసం క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు
భారత్ లో క్రమంగా పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులు
కరోనా వైరస్ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న స్ట్రెయిన్ వైరస్ భారత్ లోనే క్రమేపీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 71 కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరందరినీ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి పరిశీలిస్తున్నారు. వీరితో సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారంటైన్ లో ఉంచినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
గణతంత్ర దినోత్సవాలకు హాజరుకాలేనన్న బ్రిటన్ ప్రధాని
కరోనా స్ట్రెయిన్ కారణంగా బ్రిటన్ లో ఏర్పడిన అత్యవసర ప్రజా ఆరోగ్య సంక్షభ పరిస్థితుల నేపత్యంలో జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవాలనకు హాజరు కాలేకపోతున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ణ్యా స్థానిక పరిస్థితులు నేపథ్యంలో ప్రధాని దృష్టి పెట్టడం అత్యంత ఆవశ్యకమని అందువల్లనే గణతంత్రదినోత్సవాలకు హాజరు కాలేకపోతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ఇది చదవండి: ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా