- దేశంలో పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులు
- సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22మందికి కరోనా
- అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
దేశంలో కరోనా స్ట్రెయిన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ రోజు మరో నాలుగు కేసులు నమోదవడంతో ఇప్పటి వరకు ఉన్న కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య 29కి చేరింది. కొవిడ్-19 తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ రోజు నమోదైన బెంగలూరులో మూడు నమోదు కాగా హైదరాబాద్ లో ఒకటి వెచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
క్రమంగా పెరుగుతున్న స్ట్రెయిన్ కేసులు
బ్రిటన్ లో స్ట్రెయిన్ కేసులు వెలుగుచూడటంతో భారత్ అప్రమత్తమైంది. బ్రిటన్ నుంచి నెల రోజుల వ్యవధిలో 33వేల మంది వచ్చినట్లు విదేశాంగ శాఖ గుర్తించింది. వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా కొందరిలో కొవిడ్ 19 పాజిటివ్ గా తేలింది. గడిచిన మూడు రోజుల్లో కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25మందికి కరోనా స్ట్రెయిన్ నిర్థారాణ అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం స్ట్రెయిన్ కేసుల్లో ఢిల్లీలో 10, పశ్చిమ బెంగాల్లో 1 పూణెలో 5 హైదరాబాద్ లో 3 బెంగళూరులో 10 కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చదవండి:బ్రిటన్ విమానాలపై నిషేధం పొడిగించిన కేంద్రం
సూర్యాపేటలో కరోనా కలకలం
మరోవైపు సూర్యాపేట జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 22మందికి కరోనా సోకింది. దీంతో ఆకుటుంబం నివసిస్తున్న కాలనీవాసులకు కరోనా టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాలనీలో ఓ వ్యక్తి మృతిచెందగా అంత్యక్రియలకు భారీగా బంధువులు హాజరయ్యారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 40 మందికి కరోనా టెస్ట్ లు చేశారు. ఇందులో 22 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిని హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరిలో ఎవరికీ స్ట్రెయిన్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రత్యేక వైద్య బృందం క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. యుద్దప్రాతిపదికన శానిటైజేషన్ పనులు చేపట్టారు.
ఇదీ చదవండి: కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత