• ప్రపంచ ఔషధశాలగా భారత్
• టీకా తీసుకున్న జాగ్రత్తలు తప్పనిసరి
• వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోదీ తెలిపారు. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికి ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలని అని ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఏర్పాటు కానున్న ఎయిమ్స్ కు మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
ఇది చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం పొడిగించిన కేంద్రం
వ్యాక్సినేషన్ కు భారత్ సిద్ధం:
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సన్నాహాలు తుది దశలో ఉనాయని అతిపెద్ద వ్యాక్సినేషన్ ను చేపట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యాక్సినేషన్ కు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే చౌకగా ప్రజలకు అందిస్తామని తెలిపారు. త్వరలోనే స్వదేశీ టీకాను అందుబాటులోకి తెస్తామని నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రధాని తెలిపారు.
ఇది చదవండి: కోవిద్ ‘టీకా’తాత్పర్యం
జనరిక్ ఔషధాలతో ప్రయోజనాలు:
భారత్ తయారు చేస్తున్న టీకావైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని చెప్పారు. దేశంలో వైద్యవిద్యను మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం విస్తృతంగా కసరత్తు చేస్తోందన్నారు. పేద ప్రజలకు జనరిక్ ఔషధ కేంద్రాలతో ఎంతగానో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఏడు వేలకు పైగా ఉన్న జనరిక్ ఔషధ కేంద్రాలలో 90 శాతం కంటే తక్కువ ధరలకే మందులు లభిస్తున్నాయని ప్రధాని తెలిపారు.
వదంతులపట్ల అప్రమత్తం:
వ్యాక్సినేషన్ పై వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు ప్రధాని. అలాంటి అసత్య వార్తలకు ప్రచారం కల్పిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టింగులు, ట్రోలింగ్ చెయ్యవద్దని హెచ్చరించారు. వదంతులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఇది చదవండి: కోవిడ్ టీకా ప్రక్రియ ఇలా….
ఇది చదవండి: ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు బ్రిటన్ అనుమతి