- 80 మందికి సోకిన కరోనా
- అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం
- తాత్కాలికంగా కార్యకలాపాల నిలిపివేసిన
ఐఐటీ మద్రాస్ లో ప్రస్తుత అకడమిక్ సంవత్సరానికి సంబంధించి అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. క్యాంపస్ హాస్టళ్లలోని విద్యార్ధులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో కార్యకలాపాలు నిలిపివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఇన్ స్టిట్యూట్ లో అన్ని విభాగాలు, పరిశోధనా కేంద్రాలు, లైబ్రరీలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నిబంధనలు పాటించాలని ఆదేశాలు
ప్రస్తుతం హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు తమ గదుల్లోనే ఉండాలని, భౌతిక దూరం పాటించాలని ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేశారు. సిబ్బంది క్యాంపస్ ను శానిటైజేషన్ చేస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు సోకినట్లు అనుమానంగా ఉంటే తక్షణం అధికారులను సంప్రదించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కార్యకలాపాల నిలిపివేత
మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటినుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హాస్టళ్లలో 775 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు 409 మందికి కరోనా టెస్టులు చేయించారు. 64 మంది విద్యార్థులతో పాటు మరో 16 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్థారించారు.
అప్రమత్తమైన ప్రభుత్వం
కరోనా సోకిన వారిలో కృష్ణ, జమున హాస్టళ్లకు చెందిన విద్యార్ధులు ఎక్కువగా ఉన్నట్లు ఐఐటీ మద్రాస్. కరోనా సోకిన వారిని గిండిలోని కింగ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కాంపస్ లోని విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి: కరోనా టీకా పంపిణీకి కమిటీల ఏర్పాటు