వరుడుకావలెను సినిమాలో దిగుదిగునాగా అంటూ ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేస్తున్న తమస్
దిగు దిగు నాగా పాట ( వరుడు కావలెను ) వివాదస్పదమయింది. పాట బ్యాన్ చెయ్యాలంటున్నారు. కొంత మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు. ఇంత వరకూ బాగుంది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది.
ఈ పాట గతం లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించి,శోభన్ బాబు నటించిన ‘సర్పయాగం’ లో మొదటి సారి వాడారు. ఆ సినిమా దర్శకుడు పరుచూరి గోపాల కృష్ణ. అదేమి భక్తి గీతం కాదు. వాణి విశ్వ నాధ్ నటించిన వేంప్ పాట.
అప్పుడెవరూ అభ్యంతరం తెలుప లేదు. పైగా కొంత మంది ఆనందించారు కూడా.
ఇప్పుడెందుకు వివాస్పదమయింది ? ఇటీవల సుద్దాల ఆశోక్ తేజ రచించిన సారంగ దరియా,మళ్ళీ ఇప్పుడు ఈ పాట.
ఏ రచయితైనా నిర్మాత,దర్శకుల సూచనల ప్రకారం రాస్తాడు. ప్రసిద్ది చెందిన జానపద పదాల కి కాపీ రైట్ ఉండదు. జాతి జీవన స్రవంతి లో కలిసిపోయి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆడ పాము వలపు క్రీడలో వేగంగా ఉండడం మన కధల్లో,పురాణ ప్రతీకల్లో కనిపిస్తోంది.
బహశా ఈ రచయిత తన పాట లో అది వాడుకుని ఉండవచ్చు. ఎన్నో మంచి పాటలు అందించిన అనంత్ శ్రీరామ్ వివాదం లో చిక్కుకోవడం విచారకరం
పల్లవి గురించే అభ్యంతరం ఉంటే దానిని తొలగించ వచ్చు. ఇంత కంటే ఎన్నో అసభ్య కరమైన పాటలు మన ఆంధ్ర ప్రదేశ్ అగ్ర నటులు నటించిన సినిమాల లో ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది.
కవుల,రచయితల భావ ప్రకటన స్వేచ్ఛని కొన్ని ప్రైవేట్ ఛానల్స్ సెన్సేషన్ పేరుతో హరించాలనుకోవడం ప్రజాస్వామ్య ధోరణి కాదు.
ఎక్స్లెంట్ నారేషన్!
Article is not completed.
Jai Sri Ram jai jai sri ram Bhadrachalam Sita Ram Chandra murthy Swamy kalyanam