బాబూ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో
మహామహులు మూడు వందలమంది
మూడు సంవత్సరాల మేధో మధనంతో
విద్వన్మణి అంబేడ్కర్ కమిటీ అక్షరీకరణతో
రూపం దాల్చిన భారత రాజ్యాంగం
ధర్మో రక్షతి రక్షిత ప్రతిరూపం
మాననీయం, గౌరవార్హం.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం
భారత జాతి మనుగడకు నాలుగు స్తంభాలై
ప్రాంత, జాతి, మతాలకు అతీతమై
సర్వే జనా సుఖినో భవంతు అంటూ
కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు
చట్ట, నిర్వహణ, న్యాయ వ్యవస్థలకు
తగిన హోదాలతో
శిరోధార్యంగా నిలిచింది మన రాజ్యాంగం
ప్రపంచంలోని ఏ సమాజమైనా
కొన్ని కట్టుబాట్లతో నడవాల్సిందే
అవి పాటించని సంఘానికి మనుగడ లేదు
ఆ కట్టుబాట్లు ఒకప్పుడు నిర్దేశించింది మతం
నేటి సమాజానికి ఆ పని చేస్తున్నది రాజ్యాంగం.
మన క్షేమానికి, ఉన్నతికి మూలం రాజ్యాగం
అందుకే రాజ్యాంగానికి వందనం, అభివందనం
Also read: “26/11”
Also read: చవటాయ్!
Also read: “మేలుకో ఓటరూ”