- అన్ని వర్గాలకు సామజిక నాయ్యం
- కాంగ్రెస్ గెలుపు శ్రీకాంత చారికి అంకితం
- ప్రతిపక్షం హుందాగా ఉండాలి
- గెలవాలంటే కొట్లాడాలి
తెలంగాణ లో ప్రజాస్వామ్యం పునుర్ధరించడానికే కాంగ్రెస్ లక్ష్యంగా పని చేస్తుందని తెలంగాణకు రెండవ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయని, ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, ఈ విజయం తెలంగాణ సమాజానికి కే అంకితం అన్నారు.ఇది ఊహించినదేనని అయన స్పష్టం చేసారు. తెలంగాణ కోసం ఆత్మ బలిధానాలు చేసుకున్న అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుందని అయన భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఊహకందని విజయం అందించారాని అన్నారు. తెలంగాణ ప్రజల తీర్పు, తమకు మరింత భాద్యతను పెంచిందని అన్నారు.
బిఆరెస్ పార్టీని ఓడించాలంటే కొట్లాడాలని రాహుల్ గాంధీ సూచించించారని రేవంత్ గుర్తు చేసారు. తెలంగాణ లో మానవ హక్కులు కాపాడడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పాలన హేతుబద్దంగా పని చేస్తుందని అన్నారు. ప్రగతి భవనం గేట్లు తెరుచుకుంటాయని అన్నారు. ఇక ప్రగతి భవనం బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవనంగా మార్చుతామన్నారు. తెలంగాణలో పరిపాలన గతానికి ఇప్పటికి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేసారు. తెలంగాణలో అధికారం రావడానికి పార్టీ నైతికంగా బలం చేకూర్చిందని అన్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్, ఏ ఐ సీ సీ మల్లిఖార్జున ఖర్గే అందదండలతో కాంగ్రెస్ విజయాడంకా మోగించిందని అన్నారు.
బిఆర్ ఎస్ చేసిన తప్పిదాలు కాంగ్రెస్ చేయదు
బిఆర్ ఎస్ గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. బిఆర్ ఎస్ దుందుడుకు చర్యలకు ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షం సరైన సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్యం విలువల్ని బిఆర్ ఎస్ పాటిస్తుందని ఆశిస్తున్నామన్నారు. నైతిక విలువలపై బిఆరెస్ దెబ్బతీస్తే తెలంగాణ ప్రజలు క్షుమించరన్నారు. మాతో జత కట్టి న సీ పీ ఐ తో పాటు ప్రజాసంఘాలకు రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు
ప్రతిపక్షంగా సమర్థవంతంగా పనిచేస్తాం : కేటీఆర్
తెలంగాణ ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ప్రజల కోరిక మేరకు తాము నడుచుకుంటామని అన్నారు. బిఆరెస్ 119 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే 39 సీట్లు గెలిపించారాని అన్నారు. తాము ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధగా ఉందన్నారు. 23 సంవత్సరాలనుండి తెలంగాణ కోసం బిఆర ఎస్ పని చేసిందన్నారు. తమకు రెండు పర్యాయలు ప్రజలు అధికారం ఇచ్చారని అయన గుర్తు చేసారు. భవిష్యత్ లో మరింత కష్టపడి పని చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటి పథకాలు అమలుకు కాంగ్రెస్ కృషి చేయాలన్నారు. బిఆర్ ఎస్ ఫలితాల పై బిఆరెస్ కేడర్ ఆందోళన చెందవద్దని అయన ధైర్యం చెప్పారు.