కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రేస్ పార్టీ అద్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ లక్ష తొంబై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెపింది
అసెంబ్లీ సాక్షిగా కెసిఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావస్తూన్నా ఉద్యోగాలు భర్తీ చేయ్యడం లేదన్నారు. హరీష్ రావుకీ, ఆయన పార్టీ కి ఉద్యోగాలు వచ్చాయ్ తప్పా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనే లక్ష్యంగా గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ అద్యర్వంలో నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్లోన్న రేవంత్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షవిరమించారు. ఆనాడు తెలంగాణ నిరుద్యోగుల హక్కులని ఇందిరాగాంధీ కాపాడారు. కాంగ్రెస్ పార్టీ 12 నెలలో అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తి చేస్తామని, అందుకోసం అవసరమైతే సోనియాగాందీ కాళ్ళు పట్టుకుంటానన్నారు. గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రగతి భవన్ ని అంబెడ్కర్ భవన్ గా మారుస్తూ మొదటి సంతకం పెడతామని చేప్పారు. కెసిఆర్ మగాడు అయితే తెలంగాణ ప్రభుత్వాని రద్దు చెయ్యలని డిమాండ్ చేశారు. ఎన్నికల యుద్దానికి తాము సిద్దంగా ఉన్నామనీ, కెసిఆర్ కు చేత కాకా ప్రశాంత్ కిశోర్ ని తెచ్చుకున్నారనీ ఎద్దేవా చేశారు. యువకుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం అడుతున్నారని దయ్యబట్టారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఇప్పటివరకు తీసేయలేదని రెవంత్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు.