- చంద్రుడికి మబ్బులు కప్పాయి
- దొరల పెత్తనం పోయింది
- పాలకులం కాదు, సేవకులం
- సామాజిక సమతుల్యం కాంగ్రెస్ లక్ష్యం
- పీసీ సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తధ్యమని పీసీ సీ అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి ధీమా వ్యకం చేసారు. ఈ నెల 9 తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నదని రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ కేడర్ సంబురాలు చేసుకోవచ్చు అన్నారు. గురువారం రేవంత్ విలేకర్ల తో మాట్లాడుతూ తెలంగాణ కు దొరల ఫీడ తొలగిందాన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కామారెడ్డి ఓటర్లు సీ ఎం కేసీఆర్ ను ఒడిస్తున్నారని అన్నారు. సీ ఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రేవంత్ డిమాండ్ చేసారు. ఇక తెలంగాణ లో చంద్రునికి మబ్బులు కప్పాయని రేవంత్ సెటైర్ లు వేశారు. ప్రతి ఎన్నికల పోలింగ్ అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చేవారని, ఈసారి మీడియా ముందుకు కేసీఆర్ ముఖం చాటేసారని అన్నారు. గెలుపు, ఓటములు రాజకీయ పక్షాలకు సర్వసధారణం అన్నారు. ఐతే అధికారం లో ఉన్నానాళ్ళు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ చూసారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని నిరూపించారాని అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందాన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం పునరుద్దరణ చేస్తామన్నారు. ప్రతిపక్షం వైపు ఉన్న పార్టీలను గౌరవిస్తామన్నారు. తెలంగాణ ప్రజల నాడి అర్థం ఐయ్యిందన్నారు. 30 లక్షుల నిరుద్యోగ యువతకు కేసీఆర్ పై నమ్మకం పోయిందాన్నారు. ఆ వ్యతికత ఓట్ల రూపంలో యువత తీర్పు ఇచ్చారని ఆయన గుర్తు చేసారు. దేవుడు, కాలం ఎవరిన్ని వదలడని చెప్పారు. శ్రీకాంత్ చారి బలిధానం తెలంగాణ ఏర్పాటుకు దారి చూపించిదాన్నారు. ఉద్యమం వీరులను కేసీఆర్ పాటించుకోలేదన్నారు. డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్ చారి ఆత్మ బలిధానం, ఆ తేదీన కేసీఆర్ కు పదవీ గండం అయిందన్నారు. ప్రజలన్ని కేసీఆర్ అవహేళన చేసారని ఆయన కన్నెర్ర చేసారు.