హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)పరిధిలోని వరద బాధిత కుటుంబాలకు రూ. 50 వేల వంతున పూర్తిగా పాడైన ఇళ్లకు రూ. 5 లక్షల చొప్పు, పాక్షికంగా దెబ్బతిన వాటికి రూ. 2.5 లక్షలు వంతున అందచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని ఆ పార్టీ మేనిఫెస్టోను భారీ వర్షాలు, వరదలలో చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో చెల్లిస్తామని పేర్కొంది పార్టీ నేతలు ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ రోజు విడుదల చేశారు. అందులోని కొన్ని హామీలు….
అర్హులందరికీ ఇళ్లు
అర్హులందరికీ రెండు పడగ గదుల ఇళ్లు. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు . ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, ధరణి పోర్టల్ రద్దు, ఇంటి జాగా ఉన్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 8 లక్షలు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణానికి రూ. 4 లక్షల సాయం.2020 నుంచి గృహ నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేంత వరకు ఇంటి అద్దె కింద రూ. 60 వేలు అందజేత. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు.
అందుబాటులో వైద్యసేవలు
కోవిడ్-19 చికిత్సను ‘ఆరోగ్యశ్రీ’ పథకంలో చేర్పు.గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఇతర ఆసుపత్రులను ప్రత్యేకంగా మెరుగుపరచడం.బస్తీ దవాఖానాల సంఖ్యను 450కి పెంపు. వాటి పనివేళలు రాత్రి 9 వరకు పొడిగింపు పెంపు.అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా చక్వైద్య పరీక్షలు, మందులు ఉచిత పంపిణీ.ప్రతి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. మురికివాడలలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాల నిర్వహణ .అన్ని ప్రజా ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ట్రామా కేంద్రాలను ఆన్లైన్ ద్వారా అనుసంధానం. మలేరియా, డెంగ్యూ జ్వరాల నిరోధానికి స్పెషల్ డ్రైవ్.
రవాణా రంగం…
మహిళలకు, విద్యార్థులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో ఎంఎంటిఎస్ లోల ఉచిత రవాణా సదుపాయం. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంపు. జిహెచ్ఎంసీ పరిధిలోని చివరి కిలోమీటర్ వరకు ఆర్టీసీ బస్సుల సేవలను విస్తరింపు.మెట్రో రైలు, ఎంఎంటీఎ సేవలు పాతనగరం, శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరింపు. ప్రజా రవాణాకు సంబంధించి అన్ని సేవలకు ఒకే ట్రావెల్ కార్డు అందించండం.
మూసీ ప్రక్షాళన, పునరుద్ధరణ
మూసీనదిని ఏడాదిలోగా ప్రక్షాళన చేసి ఆ నీటిని గృహవసరాలకు వాడుకునేలా చర్యలు. పర్యాటకుల్ని ఆకర్షించేలా మూసీతీరం అభివృద్ధి. నదీ పరీవాహక ప్రాంతంలోని చెరువులను పునరుద్ధరించి భారీవర్షాల సమయంలో నీరు మూసీలోకి మళ్లేలా చర్యలు.
విద్యుత్తు రాయితీలు
జీహెచ్ఎంసి పరిధిలో 100 యూనిట్లలోపు విద్యుత్ ను ఉపయోగించుకునే గృహ వినియోగదారులకు విద్యుత్ రాయితీ.లాక్ డౌన్ కాలంలో ని విద్యుత్ బిల్లులు ఆస్థి పన్ను, మోటారు వాహన పన్ను ఒకవేళ ఇప్పటికే చెల్లించి ఉంటే ఆ మొత్తాన్ని తదుపరి బిల్లులో సర్దుబాటు.